మిస్సీరోటీలు ఇలా చేసేయండి… ప్రోటీన్‌ లోపాన్ని ఈజీగా భర్తీచేయొచ్చు..!

-

రొట్టెలు ఆరోగ్యానికి మంచిది.. డైలీ వైట్‌ రైస్‌తోనే రెండుపూట్లా తినకుండా.. రొట్టెలను తినడం అలవాటుగా చేసుకోమని వైద్యులు చెప్తుంటారు. ఇంకా దీర్ఘకాలికరోగాలు ఉన్నవారికి..రొట్టెలు తినడం చాలా ముఖ్యం. మరి రొట్టెలు ఎప్పుడూ ఒకేతీరుగా చేసుకుంటే మనకు నచ్చదు. బోర్‌ కొడుతుంది. మనం ఈ సైట్‌లో వివిధ రకాలుగా హెల్తీ రొట్టెలు ఎలా చేసుకోవాలో ఎప్పుడూ చెప్తూనే ఉంటాం. ఈరోజు ఇంకో కొత్త వెరైటీ రొట్టేలను మీ ముందుకు తీసుకొచ్చాం. శనగపిండి అంటే చాలామంది..వామ్మో ఇది తింటే గ్యాస్‌ అంటారు. మీరు శనగపిండిని ఆయిల్‌లో వేసి దేవి అలా చేసి ఉంటారు.. ఈరోజు శనగపిండితో మిస్సీరోటి చేద్దాం..

మిస్సీరోటీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు..

మల్టీగ్రెయిన్‌ పిండి ఒకటిన్నర కప్పు
శనగపిండి అరకప్పు
పచ్చిమిర్చి ముక్కలు ఒక టేబుల్‌ స్పూన్
కస్తూరిమేతి ఒక టేబుల్‌ స్పూన్
అల్లంపేస్ట్ ఒక టేబుల్‌ స్పూన్
లెమన్‌ జ్యూస్‌ ఒక టేబుల్‌ స్పూన్
మీగడ ఒక టేబుల్‌ స్పూన్
మిరియాలపొడి ఒక టీ స్పూన్
వాము ఒక టీ స్పూన్
ఇంగువపొడి కొద్దిగా
పసుపుకొద్దిగా
కొత్తిమీర కొద్దిగా
చాట్‌మసాలా కొద్దిగా

తయారు చేసే విధానం..

ఒక బౌల్‌లో మల్టీగ్రెయిన్‌ పిండి తీసుకుని అందులో శనగపిండి, పసుపు, వాము, మిరియాలపొడి, చాట్‌మసాల, ఇంగువపొడి, కస్తూరిమేతి, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లంపేస్ట్‌, కొత్తిమీర వేసి కలపుకోండి. గట్టిపెరుగు వేసి చపాతి పిండిలా కలుపుకోండి. ఒక 20 నిమిషాలు పక్కనపెట్టుకుని ఆ తర్వాత చిన్నసైజు ఉండల్లా చేసుకుని చపాతి కర్రతో మనకు కావాల్సిన సైజులో రోటీలను తయారు చేసుకోండి. నాన్‌స్టిక్‌ పాన్‌ తీసుకుని మీగడ రాసుకుంటూ రెండు వైపులా కాల్చుకోండి. అంతే మిస్సీరోటీలు రెడీ. జొన్నరొట్టెలు, రాగిరొట్టెలు బోర్‌కొట్టినప్పుడు ఇలాంటి మిస్సీరోటీలు ట్రై చేయండి.! ఎంతో రుచిగా మరెంతో ఆరోగ్యంగా ఉంటాయి కాబట్టి ఎంతతిన్నా ఏం కాదు.

చట్నీ తయారు చేసుకోవడానికి..

ఈ మిస్సీరోటీలకు చట్నీకి.. పొయ్యిమీద ఒక నాన్‌స్టిక్‌ పాత్రలో మీగడ వేసి పచ్చిమిర్చిముక్కలు, వెల్లుల్లిముక్కలు, ఉల్లిపాయ ముక్కలు దోరగా మీగడలో వేయించి అందులో టమోటా ముక్కలు కూడా వేయండి. మూతపెట్టేసి 5-6 నిమిషాలు ఉంచండి. నీరు మగ్గేదాక ఉంచి.. చల్లారాక..మిక్సీజార్‌లో వేసుకుని గ్రైండ్ చేసుకుని పక్కనపెట్టుకోండి. మరీ మెత్తగా చేసుకోకండి. ఈ రోటీల్లోకి ఈ చట్నీ చేసుకుని తింటే సూపర్‌ ఉంటుంది. నచ్చితే మీరు ట్రే చేయండి.!

Read more RELATED
Recommended to you

Exit mobile version