భక్తి: హనుమంతుడికి పూజ చేసేటప్పుడు వీటిని మర్చిపోవద్దు..!

-

అన్ని ప్రదేశాలలోనూ రామభక్తులు మరియు హనుమంతుని భక్తులు ఉంటారు. మంగళవారం నాడు కానీ శనివారం నాడు కానీ హనుమంతుడికి పూజ చేసి ఉపవాసం చేస్తూ ఉంటారు. చాలా మంది హనుమంతుడిని అలంకరిస్తూ ఉంటారు కూడా.

lord-hanuman

 

అయితే ఈ రోజు ఈ విషయానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు పండితులు చెప్పడం జరిగింది. చాలా మంది తెలియక చిన్న చిన్న తప్పులు చేస్తారని.. అయితే ఇటువంటి తప్పులు చేయడం వల్ల లాభం కంటే ఎక్కువ నష్టం కలుగుతుందని అంటున్నారు పండితులు.

మరి హనుమంతుడిని అలంకరించే సమయంలో ఎటువంటి తప్పులు చేయకూడదు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఇక ఆలస్యం ఎందుకు దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూసేద్దాం.

ఎవరైతే దోషాలు వల్ల ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్లు శనివారం పూట హనుమంతుడికి పూజిస్తే మంచిది. కాబట్టి హనుమంతుడికి పూజ చేసే వాళ్ళు ఈ విధంగా అనుసరిస్తే మంచిది. హనుమంతుడి దగ్గర దీపం పెట్టినప్పుడు నెయ్యితో దీపం పెడితే శుభం కలుగుతుందని పండితులు అంటున్నారు.

గంగ జల్లడం కూడా శుభ ఫలితాలను ఇస్తుంది. గంగ జల్లిన తర్వాత శుభ్రమైన గుడ్డతో హనుమంతుడి విగ్రహం తుడవాలి. ఆ తర్వాత జాస్మిన్ నూనె జల్లి.. దుస్తులతో అలంకరించాలి. అదే విధంగా చాలా మంది హనుమంతుడికి వెండి కానీ బంగారం కానీ పెట్టమని అంటూ ఉంటారు కానీ వెండి వాటిని అస్సలు ఉపయోగించ వద్దని పండితులు చెబుతున్నారు. ఇలా అలంకారం చేసేటప్పుడు ఈ తప్పులు చెయ్యకండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version