నేడు సమాజంలో జరుగుతున్న ఘోరాలు 90 శాతం వరకు మహిళలపై జరుగుతున్నవి కావడం చాలా శోచనీయం. దీనితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా జరిగే అవకాశం ఉన్న అన్ని మార్గాలను నిర్బంధించి దిశగా మహిళలకు వివిధ రకాలుగా అవగాహన కల్పిస్తున్నారు. ఇక తాజాగా తమిళనాడు రాష్ట్ర ఉమెన్స్ కమిషన్ చైర్ పర్సన్ ఏ ఎస్ కుమారి ఈ విషయంపై కీలక సూచనలు మహిళలకు తెలియచేశారు. ఈమె మాట్లాడుతూ సోషల్ మీడియా వాడుతున్న కాలేజీ అమ్మాయిలు మరియు మహిళలు అందరికీ ఒకటే విషయం తెలిపింది. మీరు వాడే వాష్టప్ప , ఇంస్టా గ్రామ్ మరియు పేస్ బుక్ లాంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లలో ఎటువంటి పరిస్థితుల్లో మీ ఫోటోలను డిపి లుగా పెట్టవద్దని హెచ్చరించింది.
ఈ ఫోటోలను ఉపయోగించుకుని సైబర్ నేరగాళ్ళు మార్పింగ్ చేసి మీ గురించి తప్పుడు సమాచారాన్ని ఇతరులకు పంపించే ప్రమాదం ఉందని కుమారి తెలిపారు. కాగా ఈ విషయంపై కాలేజీ అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలని ఈమె తెలిపింది.