టీనేజ్ ప్రెగ్నెన్సీ: చెప్పుకునేందుకు సిగ్గేల బాల‌?

-

తెలిసీ తెలియని వయసులో తొందరపాటు, మద్యం మత్తులో క్షణికావేశం, అవగానహ లేక చేసే బాల్య వివాహాలు.. ఇలా వివిధ రకాల కారణాల వల్ల యుక్త వయసులోనే అమ్మాయిలు గర్భం దాల్చుతున్నారు. దీన్ని టీన్ ప్రెగ్నెన్సీ అంటారు. కారణాలు ఎన్నైనా జరిగేది అనర్థమే. చిన్న వయసులో గర్భదారణ అంటే తల్లీ, బిడ్డ ఇద్దరికి ప్రమాదమే. టీన్ ప్రెగెన్సీ గురించి నలుగురితో మాట్లాడటానికి కూడా కొందరు సిగ్గుపడుతున్నారు. కానీ ప్రతీ అమ్మాయికీ ఈ అంశాలపై అవగాహన ఉండాలి. బాల్య విహాహాలు, లైంగిక వేధింపులు గురించి ఆడపిల్లకు తెలిసినప్పుడే వాటికి అడ్డుకట్ట వేయగలుగుతుంది. ఈ కథనం ద్వారా ఈ విషయం పై పూర్తి అవగాహన తెచ్చుకుందాం..

టీన్‌ ప్రెగ్నెన్సీ అంటే..?

టీన్‌ ప్రెగ్నెన్సీ అనేది చాలా సున్నితమైన అంశం. దీని గురించి మాటలాడుకోవడానికి ఇష్టపడక పోవడమే.. ఈ విషయం పట్ల అమ్మాయిల్లో అవగాహన లోపానికి, వారు చిన్న వయసులోనే గర్భం ధరించడానికి మూల కారణంగా తయారవుతుంది. మన దేశంలో ఉన్న ఎన్నో సమస్యలో ఇదీ ఒకటి. నెలసరి ప్రారంభమైన తర్వాత నుంచి, 19 ఏళ్ల లోపు గర్భం ధరించిన అమ్మాయిల్ని ‘టీన్‌ ప్రెగ్నెంట్’గా పరిగణిస్తారు. తెలిసీ తెలియని వయసులో కలిగే లైంగిక కోరికలు, లైంగిక హింస, బాల్య వివాహాలు.. వంటివి ఆడుకునే అమ్మాయిల్ని అమ్మల్ని చేస్తున్నాయి. ప్రత్యుత్పత్తి వ్యవస్థ, లైంగిక ఆరోగ్యం.. వంటి విషయాల్లో అమ్మాయిలకు సరైన అవగాహన లేకపోవడం వల్లే వారు చిన్న వయసులోనే గర్భం దాల్చుతున్నారు.

మన దేశంలో ఈ సమస్య కాస్త తీవ్రంగానే ఉంది. ఏటా సుమారు 1.6 కోట్ల మంది బాలికలు చిన్న వయసులోనే (15-19) తల్లులవుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి.. అయితే ఇలా చిన్న వయసులోనే గర్భం దాల్చిన అమ్మాయిల్లో, వారికి పుట్టే పిల్లల్లో కొన్ని దీర్ఘకాలిక అనారోగ్యాలు తలెత్తుతాయి. ఫలితంగా ఇద్దరూ జీవితాంతం ఇటు శారీరకంగా, అటు మానసికంగా బాధపడాల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు. యుక్త వయసులో ఉన్న అమ్మాయిలకు లైంగిక విద్య పట్ల పూర్తి అవగాహన కల్పిస్తేనే ఈ సమస్యను అంతం చేయచ్చు. +914067824444

యుక్తవయసులో గర్భం దాల్చటం వల్ల ఆ అమ్మాయిలో ఎదురయ్యే సమస్యలు:

సరైన వయసులో గర్భం ధరించే మహిళలతో పోల్చితే చిన్న వయసులో అమ్మలయ్యే అమ్మాయిల్లో.. ప్రెగ్నెన్సీ సమయంలో అధిక రక్తపోటు (ప్రిఎక్లాంప్సియా) వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి.. తద్వారా నెలలు నిండకుండానే బిడ్డ పుట్టడం, అది కూడా తక్కువ బరువుతో పుట్టడం.. అలాగే తల్లీబిడ్డల్లో మూత్రపిండ సంబంధిత సమస్యలు ఎదురయ్యే ప్రమాదం అధికంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.

గర్భం దాల్చిన అమ్మాయిలు రక్తహీనత బారిన పడే సమస్య కూడా ఎక్కువే! తద్వారా నీరసం, అలసట.. వంటివి తలెత్తి ఇవి అంతిమంగా ఎదిగే పిండంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.

యుక్త వయసులో ఉన్న అమ్మాయిల మరణానికి గల కారణాలన్నింటిలోకెల్లా టీన్‌ ప్రెగ్నెన్సీనే ప్రధాన కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. తెలిసో తెలియకో క్షణికావేశంలో గర్భం ధరించడం మూలంగా చాలామంది అమ్మాయిలు ఆ విషయాన్ని నలుగురితో చెప్పలేకపోతున్నారని, ఆ సమయంలో సరైన చికిత్స తీసుకోలేకపోతున్నారని.. ఇది వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది.
చిన్న వయసులో గర్భం ధరించడం వల్ల స్కూల్‌ మానేసే అమ్మాయిల సంఖ్య పెరుగుతోంది. ఇది వారి బంగారు భవిష్యత్తును తుంచేసి.. వారిని పేదరికంలోకి నెట్టేస్తుంది.

పిల్లల్లో వచ్చే సమస్యలు..

టీనేజ్‌ తల్లులు నెలలు నిండకుండానే పిల్లలకు జన్మనిచ్చే అవకాశాలు ఎక్కువ.. తద్వారా వారి మెదడు పరిణతి చెందకపోవడం, శరీరంలో అవయవ లోపాలు.. వంటి సమస్యలు పిల్లలను జీవితాంతం వెంటాడతాయి.

ఇక వారు తక్కువ బరువుతోనూ పుట్టచ్చట! తద్వారా వారిలో శ్వాస సంబంధిత సమస్యలు, డయాబెటిస్‌, గుండె సమస్యలు.. వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇవి ఒక్కోసారి శిశు మరణాలకు కూడా దారితీస్తాయి.

ఇన్ని నష్టాలు ఉన్నాయి కాబట్టి టీన్ ప్రగ్నెసీకి దూరంగా ఉండండి..తొందరపడొద్దు..జీవితం ముందు ఇంకా చాలా ఉంది..ఆకర్షణతో అడుగేస్తే..అందమైన జీవితాన్ని కోల్పోవాల్సిందే..మీరు మేలుకోండి..తోటి అమ్మాయిలకు వీటిపై అవగాహన కల్పించండి.!

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news