రాముడు అయోధ్యను ఎన్ని సంవత్సరాలు పాలించాడో తెలుసా?

-

తెలుగు ప్రజలకు శ్రీరాముడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..ఎందరికో ఆదర్శం..అందుకే తెలుగు ప్రజలు ఎక్కువగా ఆయనను పూజిస్తారు..రామాయణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు..మహా విష్ణువు అవతారంలో రాముడు అవతారం కూడా ఒక్కటి..ఏక పత్నివతుడు.కావ్యేతి హాస పురాణాలలో అతిశయోక్తులు ఉండటం సత్యం. వాటినన్నిం టిని యథాతథంగా స్వీకరించటమే కర్తవ్యం. దానిలోని సత్యా సత్యాలను నిర్ణయించటం సాధ్యం కాని పని.

పురాణాలు, యుగాల్ని అనుసరించి ఆయుః ప్రమా ణం, శరీర ప్రమాణం నిర్ణయించింది. వాటి ప్రకారం మనం అర్థం చేసుకోవాలి. కావ్యేతిహాస పురాణాలలో యుద్ధంలో పాల్గొన్న సైనికుల సంఖ్యకు, తుదకు మరణించిన వారి సంఖ్యకు, ఏకత్వం కుదరదు. ఇక రామాయణం విషయం వివరిస్తాను. సీతా పరిత్యాగ అనంతరం రాముడు పరిపాలిస్తున్నాడు. తన కొలువు కూటానికి వెలుపల లక్ష్మణుని కాపలా ఉంచాడు. ఒకనాడు రాముడు కొలువులో ఉన్నాడు. యమ ధర్మరాజు మహర్షి వేషంలో వచ్చి ఏకాంతంగా మాట్లాడాలి అని కోరాడు..

అందరు వెళ్ళిన తర్వాత అతడు అసలు విషయం గురించి వివరించాడు.నేను యముడను. నీవు శ్రీ మహా విష్ణు మూర్తివి. నీవు భూలోకంలో అవతరించి పదకొండు వేల సంవత్సరాలు అయింది. రావణాది దుష్ట సంహారం పూర్తి అయింది. కనుక అవతార పరిసమాప్తి చేయాల్సింది. అని చెబుతుండగా లక్ష్మణుడు లోపలకు వచ్చాడు. యముడ అదృశ్యం అయ్యాడు. అన్నమాట ప్రకారం తమ్ముని శిరశ్ఛేదం చేయలేక రాజ్య బహిష్కృతుని చేశాడు. లక్ష్మణుడు సరయూ నదిలో మునిగి అవతారం చాలించాడు.అలా చూసుకుంటే రాముడు పది వేల సంవత్సరాలకు పైగా రాజ్యాన్ని పాలించాడు..

Read more RELATED
Recommended to you

Exit mobile version