అమ్మాయిలు గూగుల్ సెర్చ్ లో వేటిని అధికంగా వెతుకుతారో తెలుసా..!

-

ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేని అబ్బాయి..ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ వాడని అమ్మాయి అంటూ ఎవరూ ఉండరేమో కదా..చిన్నదో పెద్దదో..ఏదో ఒకటి అందరూ స్మార్ట్ ఫోన్ వాడేస్తున్నారు. ఆఖరికి మనం వాడేసిన పాత ఫోన్లను మనం అమ్మలకు, అమ్మమ్మలకు ఇచ్చేయడంతో..వాళ్లు కూడా స్మార్ట్ బామ్మల్లా వాడేస్తున్నారు. తాజాగా గూగుల్ తన సెర్చ్ తాజాగా ఓ నివేదికను అందించింది. ఇందులో మహిళలు ఎంత సేపు ఇంటర్నెట్ ని ఉపయోగిస్తున్నారు. ఏయే విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నారు వంటి అనేక విషయాలు గూగుల్ వెల్లడించింది.
ఒక నివేదిక ప్రకారం..భారత దేశంలో దాదాపు 150 మిలియన్లు ఇంటర్నెట్ ను వినియోగిస్తున్నారని తేలింది. అయితే వీరిలో దాదాపు 60 మిలియన్ల మంది మహిళలు ఎక్కువగా ఇంటర్నెట్‌ని ఉపయోగిస్తున్నారు. అందులో 75% మంది మహిళలు 15-34 ఏళ్ల మధ్య వయసుగల వారే ఉన్నారట..వీరు తమ జీవన విధానాన్ని మెరుగు పరచుకోవడానికి ఎక్కువుగా ఇంటర్నెట్‌ని ఉపయోగిస్తున్నారు. అయితే ఈ అమ్మాయిలు ఎక్కువగా గూగుల్ లో ఏమి వెతుకుతున్నారంటే.

కెరీర్ కు సంబంధించి:

అమ్మాయిలు ఎక్కువగా కెరీర్ సంబంధిత సమాచారాన్ని వెతుకుతున్నారని నివేదిక చెప్తోంది. తమ కెరీర్ ను ఎలా మలచుకోవాలి. ఏ విధమైన కోర్సులు ఎంచుకోవాలి. తమకు ఎదురైన ఛాలెంజ్ లను ఎలా ఎదుర్కోవాలి అనే విషయంపై అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారట.

ఆన్‌లైన్ షాపింగ్ :

మొదట్లో ఆన్‌లైన్ షాపింగ్ చేయడానికి అమ్మాయిలు పెద్దగా ఆసక్తి చూపేవాళ్లు కాదు.. గత కొంతకాలంగా అమ్మాయిలు ఆన్‌లైన్ షాపింగ్ చేయడానికి బాగా ఇష్టపడుతున్నారు. కొనేసంగతి పక్కనపెడితే..టైం పాస్ కు కూడా ఎలాంటి డిజైన్లు ఏంటి..కొత్త కలక్షన్లు ఏం వచ్చాయి, ఆఫర్‌ల వంటి వాటిని ఎక్కువగా వెదుకుతున్నారని తెలిసింది.

అందం కోసం చిట్కాలు:

ఇప్పుడు అందంగా ఉండంటం అంటే..నీట్ గా బొట్టుకాటుక పెట్టుకుని పెట్టుకుని పట్టుపరికిణీ వేసుకుని రావడం కాదు..ఎక్కడైనా తమదైన శైలిలో యాట్రాక్ చేయడం.పాష్ లుక్క తో పడగొట్టేయాలి. ఏ అమ్మాయి అయినా..లోపల చాలావరకూ ఇలానే అనుకుంటుంది. స్టైల్ గా ఉండాలి..డిఫరెంట్ స్టైల్ లో కనిపించడానికే ఇష్టపడుతున్నారు. అందుకనే బ్యూటీ టిప్స్, ఫ్యాషన్ ట్రెండ్స్, హోం రెమెడీస్ గురించి ఎక్కువగా వెదుకుతున్నారని అధ్యయనాల ద్వారా తెలిసింది.

రొమాంటిక్ సంగీతం:

సంగీతం వినడానికి జండర్ తో పనిలేదు..అందరికి ఇష్టం ఉంటుంది. అయితే అమ్మాయిలు మాత్రం ఆన్ లైన్ లో రొమాంటిక్ పాటలను వినడానికి ఆసక్తిని చూపిస్తారట. అంతేకాదు అమ్మాయిలు ఇంటర్నెట్‌లో రొమాంటిక్ కవిత్వాన్ని కూడా వెతుకుతారని అధ్యయనంలో తెలిసింది.

మెహందీ డిజైన్ కోసం:

కాలం తెచ్చిన మార్పుల్లో భాగంగా అమ్మాయిలు గోరింటాకు బదులు మెహందీ డిజైన్స్ ను పెట్టుకుంటున్నారు. అందుకనే అమ్మాయిలు తరచుగా గూగుల్‌లో హెన్నా లేటెస్ట్ డిజైన్‌లను వెతుకుతున్నారట.
ఇంతకీ మీరు ఏం ఎక్కువగా వెతుకున్నారు అమ్మాయిలూ..!
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news