గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఎన్నో కలలు వస్తుంటాయి.. అయితే కొన్ని కలలు ఎందుకు పదే పదే వస్తాయో తెలియదు.. ఎన్నో రకాల కలలు పీడ కలలు వస్తూ ఉంటాయి. కొంతమంది పీడ కలలు వచ్చినప్పుడు భయపడుతూ ఉంటారు. ఆ కలలు నిజమవుతాయేమో అని ఆందోళన చెందుతూ ఉంటారు.. అయితే మామూలుగా మనం పడుకున్నప్పుడు పుట్టుక, చావు,ప్రకృతి,దేవుళ్ళు ఇలా ఎన్నో రకాల కలలు వస్తూ ఉంటాయి. అయితే స్వప్న శాస్త్ర ప్రకారం కలలు భవిష్యత్తును సూచిస్తాయని చెబుతూ ఉంటారు. ఒకవేళ కలలో వినాయకుడు కనిపిస్తే అది దేనికి సంకేతమో ఇప్పుడు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం..
కలలో వినాయక విగ్రహం కనిపిస్తే త్వరలోనే శుభవార్తలు అందుకోబోతున్నారని అర్థం. అలాగే ఇంట్లో శుభకార్యాలు లేదా మతపరమైన పనులు జరుగుతాయని అర్థం. అయితే ఆ కల గురించి ఎవరికీ చెప్పకూడదు. అలాగే కలలో శివ కుటుంబం కనిపిస్తే శుభసూచకంగా భావించాలి. అలా కనిపిస్తే త్వరలోనే మీరు కష్టాల నుండి విముక్తి పొందబోతున్నారని అర్థం. అలాగే మనకు రావాల్సిన డబ్బు రావడంతో పాటు అనుకున్న పనులు కూడా సక్రమంగా జరుగుతాయి..
ఇక వినాయకుడు ఎలుక పై వస్తున్నట్లు కనిపిస్తే మనం ప్రయాణలకు వెళ్తామని అర్థం… గణేష్షుణ్ని పూజిస్తున్నట్లు కల వస్తే మంచిదని భావించాలి.. అలాగే కలలో వినాయకుడి నిమజ్జనం చేస్తున్నట్లు వస్తే అది అశుభసంకేతంగా భావించాలి. అయితే త్వరలోనే మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోబోతున్నారని అర్థం. అలాగే మీరు ఆర్థికంగా కూడా నష్టపోవచ్చు. అయితే బ్రహ్మ ముహూర్తంలో కనిపించే గణేషుడు కల చాలా పవిత్రమైనదిగా భావించాలి… ఇలా వినాయకుడు కనిపిస్తే అంతా మంచే జరుగుతుందని భావించాలి..