హోలీ ఎప్పుడు ఎందుకు చేస్తారో మీకు తెలుసా ?

-

మార్చి 10 హోలీ పండుగ ప్రత్యేకం

హోలీ.. అంటే చిన్నా, పెద్ద అందరికీ ఇష్టమే. అయితే అసలు హోలీ పండుగ ఎప్పడు, ఎందుకు చేస్తారో వంటి విషయాలు చాలామందికి తెలియదు. వాటి గురించి తెలుసుకుందాం… ప్రతియేటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజు వచ్చే ఈ పండుగను హోలీపండగ అని, కాముని పున్నమి అని డోలికోత్సవమని పిలుస్తుంటారు. ఈ ఏడాది మార్చి 9న కామదహనం, తెల్లవారి అంటే మార్చి 10న హోలీ పండుగ చేసుకోవాలి. హోలీ అంటే అగ్నితో పునీతమైనది అని అర్ధం. అయితే హోలీ వివరాలు పురాణాల్లో విశేషాలు తెలుసుకుందాం…

పురాణాలలో హోలీ ప్రారంభకథ

ఈ పండుగ పుట్టు పూర్వోత్తరాల్లోకి వెళ్తే రాక్షసరాజు హిరణ్యకశిపుడి కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణుమూర్తిని స్మరిస్తూ ఉంటాడు. దీంతో ప్రహ్లాదుణ్ణి మెట్టుపెట్టాలని నిర్ణయించుకున్నాడు. అతని రాక్షస సోదరి హోళికని పిలిచి ప్రహ్లాదుణ్ణి మంటల్లో ఆహుతి చెయ్యాలని అభ్యర్ధించాడు. ఆమె సరేనంది. వెంటనే ప్రహ్లాదుణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకొని మంటల్లో దూకిందట. విష్ణుమూర్తి మాయతో ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడగా, హోళిక రాక్షసి మంటల్లో చనిపోయిందట. హోలిక దహనమైనది కనకనే ఈ రోజుని హోలీ అని అంటారట.


హోలీ నాడు ఏం చేయాలి ?

హోలీ రోజున పలుప్రాంతాలలో… లక్ష్మీనారాయణవ్రతం, చంద్రపూజ వంటివిచేస్తారు. మన తెలుగువారు ఈరోజు చంద్రపూజ, సత్యనారాయణ పూజ చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తి ప్రపత్తులతో చేస్తారు. చిన్నారులు, యువతీయువకులు, మహిళామణులు, అందరూ సకుటుంబ సపరివారసమేతంగా…. కలసి కట్టుగా హోలీ సందర్భంగా రంగులు పూసుకుంటూ ఆనంద పరవశులవుతారు. ఆ ప్రాంతంలో పనివార్లకు, పేదలకు హోలీ మామూలు ఇస్తారు. చిన్నపిల్లలకు హోలీ సాయంత్రం చిలకల దండలు వేసే సంప్రదాయం కూడా కొన్ని ప్రాంతాలలో ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version