ప్రపంచంలోనే అతిపెద్ద ఎలివేటర్.. ఎక్కడుందో తెలుసా..?

-

ప్రస్తుత తరుణంలో జీవన విధానం పూర్తిగా మారిపోయింది. టెక్నాలజీ మరింతగా అభివృద్ధి చెందుతోంది. అయితే పెద్ద పెద్ద మాల్స్ లో లిఫ్ట్ ని చూసి ఉంటారు. సాధారంగా ఉండే లిఫ్ట్‌ లో పది మంది వరకే ఎక్కగలరు. కానీ ఇక్కడ ఏర్పాటు చేసిన లిఫ్ట్ లో సుమారు 200 మంది వరకు ఎక్కే సామర్థ్యం ఉంది. ముంబైలోని బీజేసీ జియో వరల్డ్ సెంటర్‌లో ప్రపంచంలోనే అతి పెద్ద ఎలివేటర్‌ను ఏర్పాటు చేశారు.

ఎలివేటర్

ఈ ఎలివేటర్‌ను ముంబైలోని బాండ్రా కుర్లా కాంప్లెక్స్ లోని జియో వరల్డ్ సెంటర్‌లో ఏర్పాటు చేసినట్లు కోన్ ఎలివేటర్స్ ఇండియా కంపెనీ తెలిపింది. ఈ లిఫ్ట్ సామర్థ్యం దాదాపు 200 మంది. 5 స్టాపులు, 16 టన్నుల బరువు, 25.78 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఎలివేటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కోన్ ఎలివేటర్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ గోస్సేస్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాసింజర్ ఎలివేటర్ కోన్ ద్వారా ఉందన్నారు. ఈ లిఫ్ట్ ఇండియాలోనే ఉండటం ఎంతో సంతోషకరమన్నారు. కోన్ గ్లోబల్‌లోని ప్రధాన ప్రాజెక్టుల నిపుణుల బృందం, భారత్ బృందం కలిసి ప్రాజెక్టును రూపొందించిందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version