‘ఆవిడా..మా ఆవిడే!’ చిత్రంలో నాగార్జునకు డూప్లికేట్‌గా నటించిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

-

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటించిన ఫ్యామిలీ ఫిల్మ్ ‘ఆవిడా..మా ఆవిడే!’ ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఈ సూపర్ హిట్ పిక్చర్ కు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ఈ మూవీని హిందీ, తమిళ్ భాషల్లోనూ డబ్ చేయగా, అక్కడ సక్సెస్ అయింది. ఇక ఇందులో హీరోయిన్స్ గా తబు, హీరా రాజగోపాల్ నటించారు.

ఈ సినిమా స్టోరిలో భాగంగా నాగార్జున పాత్ర ద్విపాత్రాభినయంగా మారుతుంది. హీరోయిన్స్ ను కన్ఫ్యూజ్ చేసే క్రమంలో నాగార్జున ను డబుల్ గా చూపించడం కోసం శ్రీకాంత్ నాగార్జున కు డూప్ గా నటించారు.

Hunter Telugu Movie Stills Photos

బ్యాక్ సైడ్ నుంచి వారిరువురి షాట్స్ పెట్టి ఆ విధంగా దర్శకుడు మేనేజ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ అయింది.

ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఈ సినిమాను చూసి బాగా ఎంజాయ్ చేశారు. ఈ చిత్రానికి శ్రీ మ్యూజిక్ అందించగా, జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మూవీని ప్రొడ్యూస్ చేశారు. ఇందులో నాగార్జున కు హీరోయిన్స్ కు మధ్య ఉన్న కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. నాగార్జున ప్రస్తుతం ‘ది ఘోస్ట్’ అనే ఫిల్మ్ చేస్తున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ద్వారా డెఫినెట్ గా నాగార్జున విజయం అందుకోబోతున్నారని అక్కినేని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version