నిజంగా దేవుడు ఉన్నాడా? ఇది చదివితే డౌట్ క్లియర్ అవుతుంది…

-

ఈ భూ ప్రపంచంలోని జీవరాశిని భగవంతుడు సృష్టహించాడు..అందుకే భగవంతుడు జనాలను నిత్యం కాపాడుతాడని పురాణాలు చెబుతాయి..కంటికి కనిపించడు..కానీ సృష్టిని ఎలతాడు అని నమ్ముతారు..ఆయనను గుర్తించడం అంత సులభం కాదు. అందరూ భగవంతుడిని చూడలేరు. మన కళ్లకు కనిపించనంత మాత్రాన దేవుడు లేడని కాదు. భగవంతుడు ప్రతిచోటా ఉన్నా మన కళ్లకు కనిపించడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడే దీనికి సమాధానం చెప్పాడు. యోగమాయతో నన్ను నేను కప్పుకోవడం వల్ల, నేను అందరికీ కనిపించనని, ప్రజలు నన్ను భగవంతునిగా గుర్తించలేరని శ్రీకృష్ణుడు తెలిపాడు…

పాండవుల కథలోకి వస్తే..ఒకసారి పాండవులు రాజసూయ యాగం చేస్తున్నారు. ఆ యాగంలో పాల్గొనేందుకు రాజులు, చక్రవర్తులు, ఎందరో మహర్షులు దూరప్రాంతాల నుంచి వచ్చారు. వారందరితో మాట్లాడుతూ ధర్మరాజు తాను ఇప్పటి వరకు భగవంతుడిని చూడలేదు అని అంటాడు. ఇది విన్న నారద మహర్షి ఈ సమావేశంలో ప్రపంచాన్ని సృష్టించిన భగవానుడు ఉన్నాడని చెప్పాడు.. అవునా నేను చూడలేదే అంటూ పరిహాసం ఆడతాడు..

అయితే శ్రీకృష్ణుడు పాండవులతో కలిసి చాలా రోజులు జీవించాడు. అయినప్పటికీ, ఆయనను ఎవరూ పరమాత్మ స్వరూపంగా గుర్తించలేకపోయారు. శ్రీకృష్ణుడు భగవత్ స్వరూపమని వారెవరికీ తెలియదు. పాండవులు కృష్ణుడిని కేవలం తమ మామగారి కొడుకుగా మాత్రమే భావించేవారు. తన గురించి వివరించబోయిన నారద మహర్షిని మౌనంగా ఉండమని శ్రీకృష్ణుడు ఆజ్ఞాపించాడు. అయితే, నారదుడు మాత్రం పాండవులకు శ్రీకృష్ణుడి లీలా వైభవం గురించి చెప్పాలని నిర్ణయించుకున్నాడు… అదే విధంగా చివరి వరకు ఉన్నాడని చరిత్ర చెబుతుంది..ఇక నారాధ ముని కూడా అందుకు తగ్గట్లు అబద్దాలు చెప్పాడు..యుధిష్ఠిరుడు ఆత్మ జ్ఞానం వివరించమని అడిగినప్పుడు, శ్రీకృష్ణుడు.. నా శక్తితో నేను మానవ శరీరంలో అవతరించాను అని సమాధానమిచ్చాడు. నన్ను కేవలం మనిషిగా భావిస్తూ, విస్మరించే వారు మూర్ఖులు అని తెలిపాడు. దేవతలకు మూలం నేనే అనే సత్యాన్ని వివరిస్తాడు. స్వర్గం నా తల, సూర్యచంద్రులు నా కళ్లు, బ్రహ్మం నా నోరు, గాలి నా శ్వాస, 8 దిక్కులు నా బాహువులు, నక్షత్రాలు నా ఆభరణాలు, ఆకాశం నా హృదయం. నాకు ఒకటి కాదు వేల తలలు, వేల ముఖాలు, వేల కళ్లు, వేల చేతులు, వేల కాళ్లు ఉన్నాయి. నేను విశ్వాన్ని నిర్వహిస్తాను అని కృష్ణుడు చెప్తాడు.. శ్రీకృష్ణుని మాటలు విన్న యుధిష్ఠిరుడు తాను ఇంతకాలం భగవంతునితో ఉన్నానని గ్రహించాడు. యాగ సందర్భంగా అజ్ఞానంతో తాను మాట్లాడిన మాటలకు క్షమాపణలు కోరతాడు.. అది అసలు కథ.. ఇప్పుడు దేవుడు ఉన్నాడని నమ్ముతారా?

Read more RELATED
Recommended to you

Exit mobile version