నేడు భారీ లాభాల్లోకి షేర్ మార్కెట్లు?

-

ప్రపంచ మార్కెట్లలో సానుకూల ఫలితాల నేపథ్యంలో బుధవారం దేశీయ సూచీలు సరికొత్త గరిష్ఠాలను తాకే అవకాశం ఉన్నట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జపాన్‌కు చెందిన నిక్కీ 1.86శాతం, దక్షిణకొరియా కోస్పి 1.44శాతం, షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ 0.35శాతం లాభపడటంతో ఆసియా షేర్లు సానకూల దృక్పథంతో ట్రేడ్ అవుతున్నాయి. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టిలో ట్రెండ్లు మార్కెట్లు తిరిగి స్వదేశంలో సానుకూల ప్రారంభాన్ని సూచించాయి. సింగపూర్ ఎక్స్ఛేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ 139.70 పాయింట్లు లేదా 0.77 శాతం పెరిగి 18,224.80 వద్దకు చేరుకున్నది.

మంగళవారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 221 పాయింట్లు లేదా 0.37శాతం పెరిగి 60,616 పాయింట్లు ఎగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 52 పాయింట్లు లేదా 0.29 శాతం పెరిగి 18,056 పాయింట్ల వద్ద ముగిసింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version