ఎడిట్ నోట్: ఢిల్లీకి కేసీఆర్..సులువా?

-

మొత్తానికి టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్‌గా మారక తొలి ఆవిర్భావ సభ ఘనంగా జరిగింది. ఇప్పటివరకు తెలంగాణ రాజకీయాలకే పరిమితమైన కేసీఆర్..బీఆర్ఎస్ ద్వారా జాతీయ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పడానికి బయలుదేరిన విషయం తెలిసిందే. దేశంలో విపక్ష పార్టీలని ఏకం చేసి కేంద్రంలో బీజేపీని గద్దె దించడమే టార్గెట్ గా పెట్టుకున్నారు. ఆ టార్గెట్ లో భాగంగా మొదట ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ జరిగిందని చెప్పవచ్చు.

పేరుకు బీఆర్ఎస్ ఆవిర్భావ సభ గాని..పూర్తిగా బీజేపీని విమర్శించడమే టార్గెట్ గా పెట్టుకున్నారు. సభకు హాజరైన ముగ్గురు సీఎంలు, ఇతర జాతీయ నేతలు బీజేపీనే టార్గెట్ చేసి ఫైర్ అయ్యారు. ఇక కేసీఆర్ చెప్పాల్సిన పని లేదు. టోటల్ గా మోదీ సర్కార్ టార్గెట్ గా విరుచుకుపడ్డారు. అలాగే దేశానికి బీఆర్ఎస్ ఏం చేస్తుందో కొన్ని హామీలు కూడా ఇచ్చారు. ఇక 2024లో మోదీ ఇంటికి..ఢిల్లీకి బీఆర్ఎస్ అంటూ కేసీఆర్ నినదించారు.

May be an image of 8 people and people standing

అయితే ఈ నినాదం అంత ఈజీగా వర్కౌట్ అవుతుందా? అంటే సులువుగా ఇది వర్కౌట్ అవదనే చెప్పాలి. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ  స్ట్రాంగ్ గా ఉంది. అటు ప్రతిపక్ష కాంగ్రెస్ ఇంకా వీక్ గా ఉంది. ఇక మిగిలిన  విపక్షాలు కొన్ని కాంగ్రెస్ తో ఉండగా, కొన్ని సెపరేట్ గా ఉన్నాయి. వారు ఏకమయ్యే అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఇటు ఇప్పుడే బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లో క్లిక్ అవ్వడం జరిగే పని కాదు. అంత ఎందుకు పక్కనే ఉన్న ఏపీలోనే బీఆర్ఎస్ సెట్ అవ్వలేదు.

కాబట్టి కేంద్రంలో కేసీఆర్ రాణించడం అంత సులువు కాదు. కాకపోతే ఇప్పుడు ఖమ్మం సభ ద్వారా..తన సత్తా జాతీయ స్థాయిలో చూపించారు. అయితే ఖమ్మంలో సభ పెట్టి సక్సెస్ అయినంత మాత్రాన జాతీయ స్థాయిలో సక్సెస్ అవ్వడం అనేది ఈజీ కాదు. ఇప్పుడున్న పరిస్తితుల్లో కేసీఆర్ ఎత్తుగడలు ఫలించవు. కాకపోతే కేంద్రంపై పోరాటం అని చెప్పి తెలంగాణలో మళ్ళీ రాజకీయంగా లబ్ది పొందే అవకాశం కూడా ఉంది.

అయితే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసి బీజేపీకి మేలు చేసేలా ముందుకెళుతున్నారనే వాదనలు వస్తున్నాయి. ఆయన పూర్తిగా కాంగ్రెస్ మిత్రపక్షాలనే కలుస్తున్నారు..అంటే కాంగ్రెస్ పార్టీకి వారిని దూరం చేసే కార్యక్రమం చేస్తున్నట్లు కనిపిస్తోంది. చూడాలి మరి రానున్న రోజుల్లో కేసీఆర్ రాజకీయం ఎలా ఉంటుందో.

Read more RELATED
Recommended to you

Latest news