మలయాళంలో మోహన్ లాల్, తెలుగులో వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించిన ‘దృశ్యం2’ రెండు భాషల్లోనూ సూపర్ హిట్ అయింది. ఓటీటీలో విడుదలైనా భారీ వ్యూస్ ను సాధించింది. మూవీ మొదటి సీన్ నుంచి క్లైమాక్స్ వరకు ప్రేక్షకుల్లో ఉత్కంఠతను నెలకొల్పింది. మలయాళం మాతృకలోనే కాకుండా రీమేక్ అయిన తెలుగులో కూడా ఈ సినిమా మంచి సక్సెస్ అయింది. ఇప్పుడు హిందీ రీమేక్ విడుదలకు సిద్ధమవుతోంది. బాలీవుడ్ లో తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.
ట్రైలర్ ను చూస్తుంటే ఒరిజినల్ ని మక్కీకి మక్కీ దించేసినట్లుగా అనిపిస్తోంది. తెలిసిన స్టోరీ అయినా.. థ్రిల్లింగ్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. టేకింగ్ కూడా బాగుంది. అజయ్ దేవగన్, శ్రియా తమ పాత్రల్లో జీవించేశారు. టబు తన టెర్రిఫిక్ పెర్ఫార్మన్స్ తో మరోసారి మెస్మరైజ్ చేసేలా కనిపిస్తోంది. ఇప్పటికే రెండు భాషల్లో రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన ఈ మూవీ.. హిందీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.