మనకు ఆవు పాలు, గేదె పాలు, మేక పాలు తెలుసు..ఈ మధ్య సోయా మిల్క్ కూడా వాడుతున్నారు..ఇంకా ఏమైనా పాలు చెప్పమంటే..గాడిద పాలు కూడా ఉన్నాయి. కానీ మీకు ఆలూ మిల్క్ గురించి తెలుసా? అవును ఆలూతో పాలు..ఇప్పుడు ట్రెండింగ్ లో ఈ పాలే ఉన్నాయి. వీటిని కొనేందుకు తెగ ఉత్సాహం చూపిస్తానరట..ఎందుకు అంతలా ఏం లాభం ఉన్నాయి ఈ పాలల్లో..ఇంతకీ వీటిని ఎక్కడ తయారుచేస్తున్నారంటే..
స్వీడన్‌కు చెందిన డగ్ (DUG)కంపెనీ వీటిని బ్రిటన్‌లో ప్రవేశపెట్టింది. వీటిలో పోషకాలు ఎక్కువే.. ధర కూడా అక్కడి ప్రజలకు అందుబాటులోనే ఉంది. ఈ పాల ద్వారా వివిధ రకాల విటమిన్స్ శరీరానికి అందటంతో పాటు రుచికరంగా ఉంటాయట. సాధారణంగా ఆవులు, గేదెలు తదితర వాటి నుంచి నుంచి లభించే పాలల్లో లాక్టోజ్ ఎక్కువగా ఉంటుంది.
అయితే ఈ బంగాళాదుంప పాలలో లాక్టోజ్ ఉండదట. అందుకే శాకాహారులు వీటిని విపరీతంగా ఇష్టపడుతున్నారట. ఇక ఈ పాల ధర లీటర్ 170 రూపాయలు పలుకుతోంది. దాంతో ఈ ఆలూ పాలకి మంచి గీరాకి ఏర్పడింది. సోయా పాలలో లభించే ప్రోటీన్ల కన్నా ఇందులో నాలుగు రెట్లు అధికంగా ఉంటాయట. సోయా పాలే ఎక్కువ పోషకాలు అనుకున్నాం..వాటిని మించేసిందిగా ఈ ఆలూ పాలు.
జంతువుల నుంచి సేకరించే పాలలాగానే ఆలూ పాలు కూడా చిక్కగా, రుచికరంగా ఉంటాయంటున్నారు అక్కడి విశ్లేషకులు. ప్రస్తుతం బ్రిటన్‌లో అందుబాటులో ఉన్న ఈ పాలు.. త్వరలోనే ఐరోపాతో పాటు, అమెరికా, చైనాలోనూ ప్రారంభించే ఆలోచనలో ఉంది డగ్ కంపెనీ. ఈ పాలతో మనం కాఫీ లాగానే కాపిచీనో కూడా తయారు చేసుకోవచ్చని ఆహార ప్రియులు అంటున్నారు. వివిధ పోషకాలతో కూడిన ఆలూ పాలను కొనేందుకు ప్రస్తుతం యూకే వాసులు పోటీపడుతున్నారట. ఇది వెగాన్ ఫ్రెండ్లీ కావడంతో వీగన్లు కూడా ఈ ఆలూ పాలు కొంటున్నారట.
మొత్తానికి ఆలూ పాలూ అలా హడావిడి చేస్తున్నాయి..కొన్నాళ్లకు మనకు అందుబాటులోకి రావొచ్చు. చాలా మందికి గేదెపాలు తాగడం ఇష్టం ఉండదు. ఆ వాసన నచ్చుదు. అలాంటివారికి ఈ వేగన్ మిల్క్స్ చక్కగా ఉపయోగపడతాయి.
-Triveni Buskarowthu