ఏపీ మంత్రివర్గంలో కొనసాగుతున్న వారంతా డమ్మీ మంత్రులే: సీపీఐ రామకృష్ణ

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో కొనసాగుతున్న వారంతా డమ్మీ మంత్రులేనని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. శ్రీకాకుళంలో జరుగుతున్న సీపీఐ జిల్లా మహాసభకు ఆయన శనివారం హాజరయ్యారు. రాష్ట్రంలో నియంతపాలన కొనసాగుతోందని మండిపడ్డారు. గడిచిన మూడేళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వం చేపట్టిన గడప గడప కార్యక్రమం విఫలమైందన్నారు. దీంతో ప్రస్తుతం మంత్రులు బస్సు యాత్ర చేపట్టారని విమర్శించారు.

సీపీఐ రామకృష్ణ

ఏపీలో మంత్రులకు అధికారాల్లేవని పేర్కొన్నారు. ఆ నిర్ణయాలన్నీ తాడేపల్లి ప్యాలెన్ నుంచే అమలు అవుతాయన్నారు. సీనియర్ మంత్రులు ధర్మన, బొత్స సత్యనారాయణతో సహా అందరూ డమ్మీ మంత్రులేనని ఆరోపించారు. ప్రస్తుతం దేశంలో బీజేపీకి చెందిన కొంతమంది మత చిచ్చులు రగల్చడంతో దేశవ్యాప్తంగా ముస్లింల నిరసనలు వెలువెత్తుతున్నాయని అన్నారు. అసలు దేశానికి ప్రధాని, హోంశాఖ మంత్రి ఉన్నాడా? అని ప్రశ్నించారు. ఇన్ని రోజులైన అల్లర్లు అదుపులోకి రావట్లేదని మండిపడ్డారు. మత ఘర్షణకు కారణమైన నుపుర్ శర్మ, నవీన్ జిందాల్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అల్లర్లను అదుపులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version