ఓటీటీ లోకి రానున్న ఈగల్ సినిమా…?

-

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మాస్ మహా రాజా రవితేజ హీరోగా నటిస్తున్నటువంటి తాజా చిత్రం ఈగల్. ఇక ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ ఖరారైంది. అమెజాన్ ప్రైమ్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది అని సమాచారం . మార్చి 2 నుంచి స్ట్రీమింగ్కు అందుబాటులో ఉంటుందనే చర్చ నడుస్తుండగా.. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది .

కావ్య థాపర్ ,మధుబాల ,నవదీప్, అవసరాల శ్రీనివాస్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఫిబ్రవరి 9న  భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని, రూ.50 కోట్ల వరకూ వసూళ్లు రాబట్టింది. వినయ్ రాయ్ ప్రతినాయకుడిగా నటించిన ఈ చిత్రం, ఎమోషన్స్ పరంగా కంటే యాక్షన్ పరంగానే కనెక్ట్ అయింది. అక్రమ ఆయుధాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version