సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో నిన్న మోదీ మరియు అమిత్ షా లను కలిసి ముందస్తు ఎన్నికల గురించి ప్రస్తావించారని తెలిసిందే. అప్పటి నుండి రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల గురించే చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికలకు రెడీ అవుతున్నాడట. అందులో భాగంగా ప్రతిరోజూ నాలుగు నియోజకవర్గాల ఇంచార్జి లతో కలిసి ఆ నియోజకవర్గాలలో ఉన్న సమస్యలు మరియు స్థానిక నేతల మధ్యన ఉన్న సాన్నిహిత్యాన్ని పెంచడం వంటి వాటిపైన దృష్టి సారించారట. ఇలా అన్ని నియోజకవర్గక ఇంచార్జి లతో సమీక్షలను ఆగష్టు కల్లా పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట చంద్రబాబు. ఆ తర్వాత సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టనున్నారని టీడీపీ వర్గాల నుండి సమాచారం అందుతోంది.
ముందస్తు ఎన్నికలు: సెప్టెంబర్ నుండి ఎన్నికల ప్రచారం… జోరు పెంచిన చంద్రబాబు !
-