ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్ సమీపంలో శుక్రవారం ఉదయం రిక్టర్ స్కేల్‌పై 4.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. అంబికాపూర్‌కు పశ్చిమ వాయువ్యంగా 65 కిలోమీటర్ల దూరంలో ఉదయం 5.28 గంటలకు భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం అక్షాంశం 23.33 మరియు రేఖాంశం 82.58 మరియు భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉంది. “భూకంపం తీవ్రత:4.8, 14-10-2022న సంభవించింది, 05:28:23 IST, లాట్: 23.33 & పొడవు: 82.58, లోతు: 10 కి.మీ, స్థానం: అంబికాపూర్, ఛత్తీస్‌గఢ్ నేషనల్ సెంటర్‌లో 65 కి.మీ WNW” అని ట్వీట్ చేసింది.
ఇదిలా ఉంటే.. నిన్న తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో సైతం భూమి కంపించింది. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరులో స్వల్పంగా భూమి కంపించింది. బుధవారం రాత్రి 11.23 గంటల సంమయంలో మండల కేంద్రంలో భూకంపం సంభవించింది. అందరూ నిద్రలో ఉన్న సమయంలో భూ ప్రకంపణలు సంభవించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భయంతో ఇళ్లల్లో నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. 2 సెకన్లపాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. భూకంప తీవ్రతకు ఇళ్లలోని వస్తువులు కదిలిపోయాయని పేర్కొన్నారు. రిక్టర్‌స్కేలుపై భూకంప తీవ్రత 3.0గా నమోదు అయిందని అధికారులు వెల్లడించారు. ఉట్నూరు మండల కేంద్రానికి 7 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని చెప్పారు.