Breaking : దేశ రాజధానిలో భూకంపం

-

దేశ రాజధాని న్యూ ఢిల్లీలో న్యూయర్‌ వేళ భూమి కంపించింది. దేశ రాజధానితో పాటు దాని పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపణలు
చోటుచేసుకున్నాయి. తన ఏడాదిలోకి అడుగిడిన గంటలోనే హర్యానాలో భూకంపం వచ్చింది. దీంతో ఢిల్లీలో భూమికంపించింది. ఆదివారం తెల్లవారుజామున 1.19 గంటలకు ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో భూమి కంపించిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. దీని తీవ్రత 3.8గా నమోదయిందని వెల్లడించింది. భూకంప కేంద్రం హర్యానాలోని ఝజ్జర్‌లో ఉన్నదని చెప్పింది. భూ అంతర్భాగంలో 5 కిలోమీట్ల లోతులో ప్రకంపణలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నది.

అర్ధరాత్రి వేళ భూమి కంపించడంతో ప్రజలంతా రోడ్లపైకి పరుగులు తీశారు. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన సమాచారం ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. కొత్త ఏడాదిలోకి అడుగిడిన గంట వ్యవధిలోనే భూమిలో కదలికలు చోటుచేసుకోవడంతో ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. భూకంపంతో నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్నామంటూ పలువురు సోషల్‌ మీడియాలో పోస్టులు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version