సోనియాగాంధీపై మళ్లీ కొనసాగునున్న ఈడీ విచారణ

-

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై మొదటి దఫా ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ ముగిసింది. మంగళవారం మూడు గంటలపాటు ప్రశ్నించారు. ఈ విచారణలో సోనియా గాంధీతోపాటు ఆమె కూతురు ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే రెండోసారి కూడా విచారణ జరపనున్నట్లు సమాచారం. అయితే సోనియా గాంధీని ఈడీ విచారణ జరపడంపై కాంగ్రెస్ నేతలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు.

సోనియాగాంధీ-ఈడీ విచారణ
సోనియాగాంధీ-ఈడీ విచారణ

కేంద్ర ప్రభుత్వం కక్ష్య పూరితంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్ లో సోనియా విచారణకు నిరసనగా కాంగ్రెస్ నేతలు రోడ్డెక్కారు. ప్లకార్డులు పట్టుకుని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడికక్కడే అరెస్ట్ చేసి.. స్టేషన్‌లో తరలించారు. పోలీసుల తీరుపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. సోనియా గాంధీపై క్షక్ష్య సాధింపు చర్యలు ఆపేవరకు ఆందోళనలు చేపడతామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news