Breaking : సంజయ్‌రౌత్‌కు మరోమారు సమన్లు

-

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వరుస పెట్టి నోటీసులు పంపుతూనే ఉంది. తాజాగా.. మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మరోమారు సమన్లు జారీ చేసింది. ఈ రోజు విచారణకు హాజరు కావాలని అందులో కోరింది ఈడీ. పత్రా చాల్ హౌసింగ్ కాంప్లెక్స్ పునరాభివృద్ధిలో జరిగిన కుంభకోణానికి సంబంధించిన కేసులో ఆయనను జులై 1న దాదాపు 10 గంటల పాటు విచారించారు ఈడీ అధికారులు. ఇదే కేసుకు సంబంధించి ఏప్రిల్‌లో రౌత్ కుటుంబ సభ్యుల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఈడీ సమన్లపై అప్పట్లో స్పందించిన రౌత్.. దీనిని కుట్రగా అభివర్ణించారు.

దర్యాప్తు చేయడం ఈడీ కర్తవ్యమని, తాను పూర్తిగా సహకరిస్తానన్నారు. ఈ రోజు వాళ్లు తనను పిలవడంతో వచ్చానని, ఈడీకి సహకరిస్తూనే ఉంటానని చెప్పుకొచ్చారు రౌత్‌. కాగా, పీఎంసీ బ్యాంక్ మోసానికి సంబంధించిన కేసులో రౌత్ భార్య వర్షారౌత్‌ను కూడా ఈడీ ప్రశ్నించింది. ఇదిలా ఉంటే.. రేపు కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ సైతం నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఈడీ ముందు విచారణకు హాజరుకానున్నారు. అయితే ఇప్పటికే ఈ కేసులు ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీని 5 రోజుల పాటు ఈడీ విచారించింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version