ఎడిట్ నోట్: గెలవని వాడిపై పోరు.. భయమా?

-

రెండు చోట్ల ఓడిపోయాడు..జగన్ పెట్టిన అభ్యర్ధుల మీదే గెలవలేకపోయాడు..ఇంకా జగన్‌ని గద్దె దింపుతానని సవాల్ చేస్తున్నాడు..దమ్ముంటే నెక్స్ట్ ఎన్నికల్లో 175 సీట్లలో పోటీకి అభ్యర్ధులని దింపాలి.. నెక్స్ట్ ఎన్నికల్లో ఎన్నిచోట్ల పోటీ చేసిన గెలవడు..ప్యాకేజ్ స్టార్, చంద్రబాబుకు దత్తపుత్రుడు.. చంద్రబాబుని సీఎం చేయాలని చూస్తున్నాడు. ఈ మాటలు వైసీపీ మంత్రులు, నేతలు..పవన్ కల్యాణ్‌ని ఉద్దేశించి ఎప్పుడు చేసే విమర్శలు.

ముఖ్యంగా రెండుచోట్ల ఓడిపోయాడని పదే పదే విమర్శిస్తూ ఉంటారు. నెక్స్ట్ కూడా గెలవలేడు అంటారు. మరి గెలవలేని వాడినే వైసీపీ ఎందుకు టార్గెట్ చేస్తుంది.. పవన్ పేరునే పదే పదే ఎందుకు ప్రస్తావిస్తున్నారు. అసలు ఏ మాత్రం సత్తా లేదని భావిస్తే.. పవన్‌పై అన్నిరకాల విమర్శల దాడి ఎందుకు. ఈ ప్రశ్నలు ప్రతి సామాన్యుడుకు వస్తాయి. అదే అంశంపై పవన్ కూడా ఆలోచించారు. తాజాగా ఇప్పటం గ్రామంలో ఇళ్ళు కూల్చివేత బాధితులకు లక్ష చొప్పున సాయం చేశారు.

ఇదే సమయంలో కార్యకర్తలతో మాట్లాడుతూ..వైసీపీపై విరుచుకుపడ్డారు. వైసీపీ ఓ ఉగ్రవాద సంస్థ అని ఫైర్ అయ్యారు. ఆ సంస్థకు సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అని..అన్నీ ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయని ఫైర్ అయ్యారు. సజ్జలా.. మీకు చాలెంజ్‌ చేస్తున్నా.. 2024లో మీరెలా గెలుస్తారో చూస్తామని విరుచుకుపడ్డారు. వైసీపీ నేతల మాదిరిగా ప్రతి దానికి ఢిల్లీకి వెళ్ళి చాడీలు చెప్పానని, వైసీపీని దెబ్బకొట్టే విషయం ప్రధానికి చెప్పాల్సిన పని లేదని, ఢిల్లీకి వెళ్ళి చాడీలు చెప్పానని, ఆంధ్రాలో పుట్టా…ఆంధ్రాలో తేల్చుకుంటానని అన్నారు.

వైసీపీ నాయకులు ఇప్పటం ప్రజల గడపలు కూల్చారని.. వైసీపీ గడపలు కూల్చే వరకూ జనసేన నిద్రపోదని ప్రకటించారు. మాది రౌడీసేన కాదు.. విప్లవసేన అంటూ ఫైర్ అయ్యారు. 175కి 175 వచ్చేయాలంట. మేం నోట్లో వేళ్లు పెట్టుకుని కూర్చుంటామా..? 175 స్థానాలు గెలిచేసి మిగతా గడపలు కూల్చేయమని చెబుతారా అని అన్నారు.

ఇదే సమయంలో తనపై వైసీపీ గుంపు పడుతుందని, మరి గెలవలేని వాడి మీద ఎందుకు ఇంత ఏడుపు అని ప్రశ్నించారు. అంటే సత్తా ఏంటో తెలుసు కాబట్టే వైసీపీ తనని టార్గెట్ చేసిందని అంటున్నారు. వాస్తవానికి చూస్తే అది నిజమే అని చెప్పొచ్చు. ఎందుకంటే రెండుచోట్ల గెలవలేదు..మళ్ళీ గెలవలేడు అంటూ వైసీపీ నేతలు అంటుంటారు. మరి గెలవలేని వాడి మీద ఎందుకు విమర్శలు చేయడం, బూతులు తిట్టడం. అంటే పవన్‌ సత్తా ఉందని, ఆ సత్తాకు భయపడే వైసీపీ ఈ విధంగా టార్గెట్ చేస్తుందనే పరిస్తితి. మొత్తానికి పవన్‌కు ఏపీ రాజకీయాన్ని మార్చేయగల సత్తా ఉంది..ఆయన టీడీపీతో కలిసి వెళితే వైసీపీకి ప్రమాదం..అందుకే పవన్‌ని అంతలా టార్గెట్ చేస్తున్నారని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version