ఎడిట్ నోట్: ఎలక్షన్ ట్రెండ్.!

-

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహలం మొదలైంది. ఇటు తెలంగాణలో మరో రెండు, మూడు నెలల్లో ఎన్నికలు రానున్నాయి. అటు ఏపీకి ముందస్తు వస్తే తెలంగాణతో పాటే వచ్చేస్తాయి. కానీ ఇప్పుడున్న పరిస్తితుల్లో ముందస్తుకు అవకాశం కనిపించడం లేదు. దీంతో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు వస్తే మరో 9 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. కానీ ఇప్పటినుంచే అక్కడ పార్టీలు ఎన్నికల రణ క్షేత్రంలోకి దిగేసాయి.

నువ్వా-నేనా అన్నట్లు పోరుకు దిగారు. ప్రధాన పార్టీలైన వైసీపీ-టి‌డి‌పి గట్టిగానే పోరాడుతున్నాయి. మధ్యలో జనసేన సైతం సత్తా చాటాడానికి చూస్తుంది. ఇలా మూడు పార్టీల మధ్య పోరు నడుస్తోంది. కాంగ్రెస్, బి‌జే‌పి, కమ్యూనిస్టులు ఉన్నారు గాని..వారికి ఏపీలో పెద్దగా పట్టు లేదు. అయితే ప్రధాన పోరు టి‌డి‌పి-వైసీపీల మధ్య జరగనుంది. ఇక జనసేన కొన్ని ప్రాంతాల్లో గట్టి పోటీ ఇస్తుంది. అదే సమయంలో టి‌డి‌పి-జనసేన పొత్తు దిశగా వెళుతున్నాయి. దీంతో అధికార వైసీపీకి గట్టి పోటీ ఎదురవుతుంది. ఇప్పుడున్న ట్రెండ్ బట్టి చూస్తే ఏపీలో వైసీపీకే లీడ్ కనిపిస్తుంది.

కానీ గత ఎన్నికల మాదిరిగా వన్‌సైడ్ బలం వైసీపీకి లేదు. టి‌డి‌పి-జనసేన కలోయిస్తే గట్టి పోటీ ఇస్తాయి . దీంతో హోరాహోరీ పోరు జరిగే ఛాన్స్ ఉంది. ఎవరు గెలిచిన 100-120 సీట్ల లోపే గెలుస్తారు. ఇటు తెలంగాణ ఎన్నికల ట్రెండ్ చూస్తే..ఇక్కడ మూడో సారి అధికారంలోకి రావాలని బి‌ఆర్‌ఎస్ చూస్తుంది. అటు కాంగ్రెస్ సైతం గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమవుతుంది. బి‌జే‌పి సైతం రేసులోకి రావాలని చూస్తున్నారు.

అయితే ప్రధాన పోటీ బి‌ఆర్‌ఎస్-కాంగ్రెస్‌ల మధ్య ఉంటుంది. కొన్ని సీట్లలో బి‌జే‌పి కూడా పోటీ ఇస్తుంది. ఇక ప్రస్తుతం లీడింగ్ బి‌ఆర్‌ఎస్ వైపే ఉంది. ఇక బి‌జే‌పి బలం బట్టే కాంగ్రెస్ గెలుపు ఆధారపడి ఉంది. బి‌జే‌పి బలం ఇంకా తగ్గితే కాంగ్రెస్‌కు ప్లస్..పెరిగితే బి‌ఆర్‌ఎస్‌కు ప్లస్. ఈ సారి తెలంగాణలో 80 లోపే సీట్లు గెలుచుకుని బి‌ఆర్‌ఎస్ లేదా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version