ఎడిట్ నోట్: తెలంగాణలో కర్ణాటకం..!

-

కర్ణాటకలో వచ్చే ఎన్నికల ఫలితాల బట్టే..తెలంగాణలో రాజకీయం జరుగుతుందని, అక్కడ గెలుపోటములు ఇక్కడ కూడా ప్రభావితం చూపిస్తాయని విశ్లేషకులు పెద్ద ఎత్తున చర్చ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే నిజంగానే తెలంగాణలో కర్ణాటక ఎన్నికల ఫలితం ప్రభావం ఉంటుందా? అంటే దానికి పూర్తిగా అవుననే సమాధానం చెప్పలేం. అయితే ఆ పరిస్తితులని మాట్లాడుకునే ముందు కర్ణాటక ఎన్నికల గురించి మాట్లాడుకుంటే..మరో రెండో రోజుల్లో అంటే మే 10న ఎన్నికలు జరగనున్నాయి. మే 13న ఫలితాలు వస్తాయి.

అక్కడ ఏ ప్రభుత్వం వస్తుందో ఆ రోజు తేలిపోతుంది. సరే అక్కడ ఏ పార్టీ గెలుస్తుందో ముందే చెప్పలేం. కానీ ఎక్కువ శాతం సర్వేలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. సరే ఏదేమైతే ఏముంది మరో 5 రోజుల్లో అక్కడ కింగ్ ఎవరో తేలుతుంది. ఇక అక్కడ వచ్చే ఫలితాలు రాబోయే తెలంగాణ ఎన్నికలని ప్రభావితం చేస్తాయని అంటున్నారు. ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి.

అంటే దాదాపు 6 నెలలు..ఈ ఆరు నెలల పాటు కర్ణాటక ఎన్నికల ఫలితాలు..తెలంగాణపై ఉండటం అనే అసాధ్యం..అప్పటికి కర్ణాటక ప్రభావం తగ్గిపోతుంది. కాకపోతే తెలంగాణ పక్కనే ఉండటం తో ఆ ప్రభావం కొంతమేర ఉంటుంది..దీని బట్టి చూస్తే కర్ణాటకలో బి‌జే‌పి గాని గెలిస్తే..తెలంగాణలో కాస్త ప్రభావమే ఉంటుంది. అలా అని తెలంగాణలో బి‌జే‌పి గెలిచేస్తుందని చెప్పలేం. అలాగే కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే..తెలంగాణలో కాంగ్రెస్ సత్తా చాటుతుందని చెప్పలేం.

ఏదో కొంతమేర ప్రభావం తప్ప..తెలంగాణలో కర్ణాటక ఎన్నికల ప్రభావం పెద్దగా ఉండదనే చెప్పాలి. ఎన్నికల సమయంలో తెలంగాణలో ఉన్న పరిస్తితులు, పార్టీల ప్రచారం, హామీలు, పోల్ మేనేజ్‌మెంట్ బట్టే తెలంగాణ ఎన్నికల్లో గెలుపోటములు ఆధారపడి ఉంటాయి..అంతే తప్ప తెలంగాణపై కర్ణాటక ఎన్నికల ప్రభావం తక్కువే అని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news