ఎడిట్ నోట్: జగన్‌కు ‘యాంటీ’ ఎక్కడ?

అబ్బో సీఎం జగన్ పై ప్రజా వ్యతిరేకత ఎక్కువ ఉంది. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏపీ నాశనం అయిపోయింది. ప్రత్యర్ధులని దెబ్బతీసే విధంగానే జగన్ పాలన కొనసాగింది. వ్యవస్థలని నాశనం చేశారు. ప్రజలపై దారుణంగా పన్నుల భారం వేశారు..అప్పులపై అప్పులు చేశారు. ఆర్ధికంగా నాశనం చేశారు. ఇంకా రాష్ట్రం 20 ఏళ్ళు వెనక్కి వెళ్లిపోయిందంటూ..టి‌డి‌పి పెద్ద ఎత్తున ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే టి‌డి‌పి విమర్శల్లో వాస్తవాలు ఉన్నాయా? జగన్ పాలన పట్ల నిజంగానే ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారంటే..కాస్త అవును.కాస్త కాదని చెప్పవచ్చు. కొన్ని వర్గాల ప్రజలు కాస్త అసంతృప్తితో ఉన్న మాట వాస్తవమే..అదే సమయంలో పేద, మధ్య తరగతి ప్రజలు మాత్రం జగన్ పాలన పట్ల సంతృప్తిగానే ఉన్నారు. ఆయన ఇచ్చే సంక్షేమ పథకాలు పట్ల ప్రజలు ఆనందంగా ఉన్నారు. పథకాల వల్ల తమకు బాగా బెనిఫిట్ జరుగుతుందని అంటున్నారు.

అదే సమయంలో ఇంతకాలం అభివృద్ధి లేదని, పెట్టుబడులు రావడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు వాటికి కూడా బ్రేక్ పెడుతున్నాయి. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. కొత్త కంపెనీలు వస్తున్నాయి. అదే సమయంలో కేంద్రం నుంచి నిధులు సాధించడంలో జగన్ సక్సెస్ అవుతున్నారు. ఇటీవలే వెనుకబడిన ప్రాంతాల నిధులు వచ్చాయి. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకు నిధులు వచ్చాయి. దీంతో పోలవరం పనులు వేగవంతం కానున్నాయి.

ఇక రేపో మాపో జగన్ ప్రత్యేక హోదా కూడా సాధిస్తారని అంటున్నారు. ఇలా నిదానంగా జగన్ పై ఉన్న వ్యతిరేకత తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు జగన్ వైపే ఉన్నారు. మళ్ళీ ఎన్నికల్లో ఆయనే గెలవాలని చూస్తున్నారు. అయితే టి‌డి‌పి, జనసేన పొత్తుతో ముదుకెళుతున్నాయి. దాని వల్ల వైసీపీకి కాస్త ఎఫెక్ట్ అవ్వవచ్చు. కానీ జగన్ పాలనని చూసిన ప్రజలు వైసీపీకే వన్ సైడ్‌గా ఓట్లు వేయనున్నారు. దీంతో జగన్ మళ్ళీ సి‌ఎం అవ్వడం ఖాయమే.