ఎడిట్ నోట్ : పీకే డ్రామా స్టార్ట్స్ నౌ !

-

పీకే అంటే ఏమ‌నుకున్నావు రా పొలిటిక‌ల్ క‌బాలీ.ఇంకా చెప్పాలంటే ఆయ‌న వంగొని ఎవ్వ‌డికీ ఎస్ బాస్ అని చెప్ప‌డు కానీ.. అనుకున్న‌వ‌న్నీ చేసుకుంటూ పోతాడు.ద‌టీజ్ పీకే (పీకే అంటే ప్ర‌శాంత్ కిశోర్ అని అర్థం). ఇప్పుడు తెలంగాణ రాజకీయంలోనూ చేస్తున్న‌ది ఇదే!చేయాల‌నుకుంటున్న‌దీ ఇదే! అయితే సెంటిమెంట్ రాజ‌కీయాలు న‌డ‌ప‌డం లేదా సున్నిత భావోద్వేగాలు రెచ్చ‌గొట్ట‌డం.

ఇవే ఆయన‌కు తెలిసిన సూత్రాలు.ఆ విధంగా ఆయ‌న‌కు తెలిసిన టెక్నిక్స్  తో ఆంధ్రాలో నెగ్గుకువ‌చ్చాడు. జ‌గ‌న్ ను సీఎం చేశాడు.ఆయ‌న‌తో న‌వ‌ర‌త్నాల రూపంలో వివిధ జ‌నాక‌ర్ష‌క ప‌థ‌కాలు ప్ర‌క‌టింప‌జేశాడు.త‌రువాత కాలంలో ఆయ‌న కాంగ్రెస్ కు వ్యూహ‌క‌ర్త‌గా వెళ్తాడ‌ని అంతా భావించారు కానీ అది కుద‌ర్లేదు.కొన్ని సంద‌ర్భాల్లో కాంగ్రెస్ తో స‌ఖ్యంగా ఉన్న‌ప్ప‌టికీ ఎందుక‌నో ఆ స్నేహం పూర్తి స్థాయిలో ఫ‌లితం ఇవ్వ‌లేదు.దీంతో అర్ధంత‌రంగానే రాహుల్ కు గుడ్ బై చెప్పి బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు.

తాజాగా కేసీఆర్ పార్టీకి వ్యూహాలు అందించేందుకు సిద్ధం అవుతున్నాడు.ప్ర‌శాంత్ కిశోర్ త‌ర‌ఫున జాతీయ స్థాయిలో త్వ‌ర‌లో ఓ స‌ర్వే జ‌ర‌గ‌నుంది.ఇదే స‌మ‌యంలో తెలంగాణ‌లోనూ ఇంకా వీలుంటే ఆంధ్రాలోనూ కూడా త‌న‌కు చెందిన ఐ ప్యాక్ టీంతో స‌ర్వేలు చేయించి స్థానిక ప్ర‌భుత్వాల ప‌నితీరు గురించి పూర్తి స్థాయిలో ఆయా పార్టీల పెద్ద‌ల‌కు వివ‌రించ‌నున్నాడు. అదేవిధంగా జాతీయ స్థాయిలో కేసీఆర్ ను లీడ‌ర్ గా ఫోక‌స్  చేసేందుకు కూడా స‌హ‌క‌రించ‌నున్నాడు.ఇప్ప‌టికే మ‌ల్ల‌న్న సాగ‌రం తో పాటు ఇంకొన్ని అభివృద్ధి ప‌నుల‌నూ చూసి వ‌చ్చాడు ప్ర‌శాంత్ కిశోర్.

ఆయా సంద‌ర్భాల్లో సంబంధిత అధికారుల‌తో మాట్లాడి మీడియాలో హైలెట్ అయ్యాడు కూడా ! త్వ‌ర‌లో తెలంగాణ మోడ‌ల్ పేరిట ఇప్ప‌టిదాకా కేసీఆర్ చేపట్టిన ప్రాజెక్టులను ఇత‌ర ప‌నుల‌ను జాతీయ స్థాయిలో ప్ర‌చారం చేయ‌నున్నాడు. ఇక తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో శ్రీ‌నివాస్ గౌడ్ (మంత్రి) హ‌త్యకు కుట్ర అంటే ఓ పెద్ద నాట‌కమే పీకే న‌డిపిస్తున్నాడ‌ని డీకే అరుణ అనే బీజేపీ లీడ‌ర్ మండిప‌డుతున్నారు.ఒక‌వేళ ఇదే క‌నుక నిజం అయితే పీకే డ్రామా అన్న‌ది  మొద‌ల‌యింద‌నే భావించాలి.నిర్థారించాలి కూడా!

Read more RELATED
Recommended to you

Exit mobile version