ఎడిట్ నోట్: సెప్టెంబర్ ‘17’..!

-

తెలంగాణ ఎన్నికలకు ఇంకా షెడ్యూల్ విడుదల కాలేదు..ఈ నెలాఖరు లేదా అక్టోబర్ లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా కేంద్రం ఏమైనా జమిలి ఎన్నికల ఆలోచన చేస్తే..ఇంకా ఏమైనా మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. సరే ఎన్నికల షెడ్యూల్ గురించి పక్కన పెడితే..అప్పుడే తెలంగాణలో ఎన్నికల వేడి మాత్రం మొదలైంది. దీంతో మూడు ప్రధాన పార్టీలు ఎన్నికల శంఖారావం పూరించాయనే చెప్పాలి. ఓటర్లని ఆకట్టుకోవడానికి ఎవరి హామీలు వారు ఇస్తున్నారు.

ఈ సారి ఎన్నికల్లో గెలిచి మళ్ళీ అధికారం చేపట్టాలని బి‌ఆర్‌ఎస్, ఈ సారైనా గెలిచి అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్..ఈ ఒక్కసారి గెలిస్తే చాలు..తెలంగాణలో తిరుగుండదని బి‌జే‌పి భావిస్తున్నాయి. ఇలా మూడు పార్టీలకు ఎవరి వ్యూహాలు వారికి ఉన్నాయి. ఇదే సమయంలో ఎన్నికల సమయం దగ్గరపడటంతో..రాజకీయాన్ని సెప్టెంబర్ 17 రోజన మరింత వేడెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాయి. అదే రోజు పార్టీలు టార్గెట్ చేయడానికి కారణాలు ఏమున్నాయో చెప్పాల్సిన పని లేదు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచనదినం. నైజాం పాలన నుంచి హైదరాబాద్ ప్రాంతం..ఇండియాలో విలీనమైన రోజు.

ఈ సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవం బి‌జే‌పి, కాంగ్రెస్ డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. కానీ అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీ పెద్దగా ఆ విషయాన్ని పట్టించుకోలేదు. కానీ గత ఏడాది సెప్టెంబర్ 17 వేడుకల్లో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా పళ్గోన్నారు. బి‌జే‌పి ఈ కార్యక్రమం చేయడంతో బి‌ఆర్‌ఎస్ సైతం జాతీయ సమైక్యత దినోత్సవం పేరుతో కార్యక్రమాలు చేసింది. అటు కాంగ్రెస్ ఈ కార్యక్రమాలని చేసింది. అయితే ఈ ఏడాది కాంగ్రెస్ ఈ విషయంలో ముందుంది. ఎలాగో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు హైదరాబాద్ వేదికగానే జరుగుతున్నాయి.

సోనియా గాంధీ, రాహుల్, ఖర్గే లాంటి జాతీయ నేతలు వస్తున్నారు. సెప్టెంబర్ 17న భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. అటు బి‌జే‌పి సైతం వరంగల్ లో అమిత్ షాని తీసుకొచ్చి భారీ సభకు ప్లాన్ చేస్తున్నారు. ఇలా ప్రతిపక్షాలు సెప్టెంబర్ 17పైనే గురి పెట్టాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలకు ధీటుగా బి‌ఆర్‌ఎస్ సైతం ఆ రోజున భారీగా కార్యక్రమాలు చేయడానికి ప్లాన్ చేసినట్లు తెలిసింది. మొత్తానికి సెప్టెంబర్ 17 రాజకీయంగా సంచలనంగా మారుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news