వచ్చే ఎన్నికలు మరింత రసవత్తరం కానున్నాయి.ఓ వైపు ఉగాది నుంచి కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి సన్నాహాలు మరోవైపు 3 రాజధానుల ఏర్పాటుపై నెలకొంటున్న వివాదాలు,ప్రతిష్టంభనలు తదితర వివరాల నేపథ్యంలో కొత్తగా మరో అంశం ఆంధ్రాలో తెరపైకి వచ్చింది.బ్రదర్ అనీల్ నేతృత్వంలో మరో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభం కానుందన్న వార్త హల్చల్ చేస్తోంది.
ఇదే కనుక జరిగితే వైసీపీ పై దాడి చేసేందుకు విపక్షాల జాబితాలో సొంత గూటి మనుషులే చేరిపోవడం ఖాయం. ఎందుకంటే ఇప్పటికే జనసేన కానీ టీడీపీ కానీ ఒకే వ్యూహంతో పనిచేస్తున్నాయి.బీజేపీ కూడా అదే దారిలో ఉన్నా కూడా ప్రబల శక్తిగా ఆ పార్టీ ఆంధ్రాలో ఎదగలేకపోతున్నది అన్నది ఓ వాస్తవం.ఈ నేపథ్యంలో కొత్త పార్టీ ప్రకటన నేపథ్యంలో బ్రదర్ అనీల్ సాధించేదేంటి?
రాజకీయంగా ఇప్పటికే టీడీపీ,జనసేన వ్యూహాలు ఎలా ఉన్నా ఆ రెండూ మైత్రి బంధంతోనే వెళ్తున్నాయి. పొత్తు ఉన్నా లేకున్నా కూడా పవన్ పెద్దగా టీడీపీ నేతలను టార్గెట్ చేయరు.చేయనివ్వరు కూడా! ఇక వచ్చే ఎన్నికల్లో బ్రదర్ అనీల్ వస్తే ఎక్కువ వలసలు టీడీపీ నుంచే ఉంటాయి.అధికార పార్టీ అసంతృప్త నేతలు కూడా వెళ్తారు.ఆ కోవలో వైసీపీ సీనియర్లు కూడా ఉంటారు. ఎప్పటి నుంచో అసంతృప్తితో ఉన్నవారికి టీడీపీ కన్నా జనసేన కన్నా బ్రదర్ అనీల్ పెట్టబోయే పార్టీనే మంచి ఛాయిస్ కానుంది.