గతంలో కేసీఆర్ కాబినెట్ లో పనిచేసిన ఈటల రాజేందర్ వివిధ కారణాలతో పార్టీ నుండి బయటకు వెళ్లి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా కేసీఆర్ సర్కారు మరియు పార్టీ వ్యవహారాల గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు ఈటల. ఈయన మాట్లాడుతూ… గతంలో హుజురాబాద్ లో వచ్చిన ఫలితమే రానున్న ఎన్నికల్లో రాష్ట్రము అంతా పునరావృతం అవుతుందని ఈటల క్లారిటీగా చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్ చేస్తున్న పాలన పట్ల ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారని ఈటల గుర్తు చేశాడు. ఇక కేసీఆర్ చేస్తున్న రాజకీయాల పట్ల సొంత పార్టీ నేతలే విసుగుతో ఉన్నారన్నారు. ప్రగతి భవన్ సాక్షిగా జరుగుతున్న కుట్రలు కుతంత్రాలను ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ఆపివేయాలని ఈటల మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి సూచించారు.
కాగా ఇటీవల ఈటల రాజేందర్ కు కొందరి నుండి ప్రాణహాని ఉందని చెప్పడంతో, వెంటనే విచారణ చేపట్టిన అధికార పార్టీ ఆయనకు భద్రత కల్పించడానికి ఓకే చెప్పింది.