తాండూరు-ఎల్బీనగర్‌లో గులాబీకి గుబులు..!

-

పూర్తిగా బలం ఉన్నప్పుడు కూడా..ఇతర పార్టీల నుంచి నేతలని తీసుకోవడం వల్ల ఆధిపత్య పోరు పెరుగుతుంది తప్ప..అక్కడ రాజకీయ పార్టీలకు కలిగే లాభం పెద్దగా ఉండదు. తర్వాత ఆధిపత్య పోరు పార్టీలని ముంచుతాయి. ఇప్పుడు తెలంగాణలో అధికార పరిస్తితి కూడా అంతే..గత ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ 88 సీట్లు గెలిచి పూర్తిగా మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. అయినా సరే కాంగ్రెస్ 12, టి‌డి‌పి నుంచి ఇద్దరు , ఇద్దరు ఇండిపెండెంట్లని బి‌ఆర్‌ఎస్ లోకి తీసుకొచ్చారు. దీని వల్ల బి‌ఆర్‌ఎస్ కు అదనంగా వచ్చిన బలం ఏమి లేదు. కానీ అదనంగా ఆధిపత్య పోరు వచ్చింది.

బి‌ఆర్‌ఎస్ లోకి వచ్చిన ఎమ్మెల్యేల మధ్య, బి‌ఆర్‌ఎస్ లో పోటీ చేసి ఓడిన నేతలకు పొసగడం లేదు. పెద్ద రచ్చ జరుగుతుంది. దీని వల్ల ఇటీవల బి‌ఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్ లోకి జంప్ కొట్టేస్తున్నారు. ఇదే క్రమంలో తాండూరు, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో అదే పరిస్తితి ఉంది. గత ఎన్నికల్లో తాండూరులో కాంగ్రెస్ నుంచి పైలట్ రోహిత్ రెడ్డి గెలిచి..బి‌ఆర్‌ఎస్ లోకి వచ్చారు. అక్కడ బి‌ఆర్‌ఎస్ నుంచి పట్నం మహేందర్ రెడ్డి ఓడిపోయారు.

అయితే పట్నంకు ఎమ్మెల్సీ ఇచ్చారు..ఆయన సోదరుడు నరేందర్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నారు..ఆయన భార్య జెడ్పీ చైర్‌పర్సన్ గా ఉన్నారు. కానీ ఎన్ని ఇచ్చిన అసెంబ్లీలో పోటీ చేయడం, ఎమ్మెల్యే అనేది వేరు. అందుకే పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే సీటు కోసమే ట్రై చేస్తున్నారు. కానీ సీటు రోహిత్ రెడ్డికి దక్కేలా ఉంది. దీంతో పట్నం పార్టీ మారిపోవాలని చూస్తున్నట్లు తెలిసింది. ఒకవేళ పార్టీ మారిన అక్కడ బి‌ఆర్‌ఎస్‌కు ఇబ్బంది…పార్టీలో ఉంటూ సీటు దక్కకపోయినా బి‌ఆర్‌ఎస్ గెలుపుకు సహకరించరు.

ఇటు ఎల్బీనగర్ లో అదే పరిస్తితి.. అక్కడ కాంగ్రెస్ నుంచి సుధీర్ రెడ్డి గెలిచి..బి‌ఆర్‌ఎస్ లోకి వచ్చారు. ఇప్పటికే ఆయనపై వ్యతిరేకత ఉంది. ఇక ఈయనకు వ్యతిరేకంగా బి‌ఆర్‌ఎస్ నేత రామ్ మోహన్ గౌడ్ ఉన్నారు. ఇలా రెండు వర్గాలుగా పార్టీ చీలిపోయింది. నెక్స్ట్ ఒకరికి సీటు ఇస్తే మరొకరు సహకరించరు. దీని వల్ల బి‌ఆర్‌ఎస్ పార్టీకే నష్టం.

Read more RELATED
Recommended to you

Latest news