Big News : మునుగోడు ఉప ఎన్నిక RO పై వేటు.. మరొకరికి బాధ్యతలు

-

మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ సమీపిస్తున్నకొద్దీ మునుగోడులో రాజకీయాలు కాక రేపుతున్నాయి. ప్రధాన పార్టీల నాయకులు అందరూ ఎన్నికల ప్రచారంలో దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. రోడ్డు రోలర్‌ గుర్తు మార్పు విషయంలో ఆర్వో నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుబట్టింది ఈసీ. ఆ గుర్తును ఎందుకు మార్చుకోవాల్సి వచ్చిందో వివరణ తీసుకోవాలని సీఈవోకు ఆదేశాలు ఇచ్చింది. ఆర్వో వివరణపై సాయంత్రం నివేదిక పంపాలని ఆదేశించింది. అదే సమయంలో మునుగోడు అభ్యర్థుల గుర్తుల జాబితా సవరించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. అంతేకాకుండా.. మునుగోడు రిటర్నింగ్‌ అధికారి జగన్నాథరావుపై కేంద్ర ఎన్నికల కమిషన్ వేటు వేసింది. రోడ్డు రోలర్‌ గుర్తు మార్చారని ఫిర్యాదు రాగానే ఈసీ తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే.

మునుగోడులో గెలుపే లక్ష్యంగా పార్టీల వ్యూహాలు.. ఓటర్లను ప్రసన్నం చేసుకునే  పనిలో అభ్యర్థులు

ముందు కేటాయించిన గుర్తులు ఎందుకు మార్చారని ఆర్వో నుంచి వివరణ తీసుకొని ఇవాళ సాయంత్రంలోగా నివేదిక పంపాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో)ను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అంతేకాకుండా, ఆ ఆర్వోపై చర్యలకు ఉపక్రమించింది. ఆర్వోను మార్చాలని నిర్ణయం తీసుకుంది. దీంతో కొత్త ఆర్వో కోసం మూడు పేర్లను అధికారులు ఎన్నికల సంఘానికి పంపారు. సాయంత్రంలోగా కొత్త రిటర్నింగ్‌ అధికారి నియామక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. అయితే.. మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్‌ సింగ్‌కు మునుగోడు ఉప ఎన్నిక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news