ఎమర్జింగ్ ఆసియా కప్ : 211 పరుగులకు ఇండియా ఆల్ అవుట్ !

-

ఈ రోజు ఎంతో కీలకం అయిన ఎమర్జింగ్ ఆసియా కప్ 2023 లో సెమీఫైనల్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. మొదట జరిగిన పాక్ మరియు శ్రీలంక మ్యాచ్ లో పాకిస్తాన్ పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్ కు దూసుకు వెళ్ళింది. ఇక రెండవ సెమీఫైనల్ లో ఇండియా మరియు బంగ్లాదేశ్ ల మధ్యన జరుగుతున్న మ్యాచ్ లో ఇండియా మొదట బ్యాటింగ్ లో కేవలం 211 పరుగులు మాత్రమే చేసి ఆల్ అవుట్ అయింది. గత మ్యాచ్ లో చూపించిన జోష్ ఈ మ్యాచ్ లో చూపించడంలో ఫెయిల్ అయ్యారు. బ్యాట్స్మన్ అందరూ విఫలం అయిన వేల కెప్టెన్ యాష్ ధూల్ ఒక్కడే చివరి ఓవర్ వరకు క్రీజులో ఉండి కనీసం ఈ మాత్రం స్కోర్ అయినా సాధించి పెట్టాడు. లేదంటే ఇంకా దారుణమైన స్కోర్ కు పరిమితం అయి ఉండేది. ఇప్పుడు ఈ మ్యాచ్ లో గెలిచి ఫైనల్ కు చేరుకోవాలంటే బ్యాటింగ్ లో బలంగా ఉన్న బంగ్లాను కట్టడి చేసి ఓడించాలి.

ఇండియా మరియు పాకిస్తాన్ ఫైనల్ ను చూడడానికి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.. కాబట్టి వారందరి ఆశను నెరవేర్చాలంటే ఈ మ్యాచ్ లో ఇండియా గెలవాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version