పెళ్లికి సిద్ధమైన ఈషా రెబ్బ.. వరుడు ఎవరంటే..?

-

తెలుగు హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఈషా రెబ్బ నటనలోనే కాదు అందంలో కూడా ఒక స్టార్ హీరోయిన్ కు ఏ మాత్రం తీసిపోదు.. ముఖ్యంగా గ్లామర్ విషయంలో కూడా ఆమె అంతే ట్రెండ్ ఫాలో అవుతూ ఉంటుందని చెప్పవచ్చు. అందం, నటన అన్నీ ఉన్నా కూడా అదృష్టం కలిసి రాక ఈమె సినిమాలలో పెద్దపెద్ద అవకాశాలను సంపాదించుకోలేకపోతోంది. ముఖ్యంగా తెలుగమ్మాయి కావడమే ఇందుకు ప్రధాన కారణం అని కొంతమంది తమ ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ముంబై, చెన్నై లేదా ఇతర దూర ప్రదేశాల నుంచి వచ్చి ఉంటే ఈమెను వరుస అవకాశాలు కట్టిపడేసేవి అని కూడా చెబుతున్నారు ఈమె అభిమానులు. ఇకపోతే వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకోకుండా నటిస్తూ మెప్పిస్తోంది ఈషా రెబ్బా..

ఇదిలా ఉండగా తాజాగా ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకోబోతోంది అంటూ వార్తలు వైరలవుతున్నాయి. ఇక అసలు విషయం ఏమిటంటే ఈమె ఒక డైరెక్టర్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు , అది కూడా ఒక తమిళ్ దర్శకుడితో వివాహం అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు వీరి వివాహానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానుందట. అయితే ఇవన్నీ ప్రస్తుతం ఒక రూమర్ గా సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉండడం గమనార్హం. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ విషయంపై ఈషా రెబ్బ వెల్లడించక తప్పదు.

ప్రస్తుతం ఈమె ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరొకవైపు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తోంది. పిట్ట కథలు, 3 రోజెస్ వంటి వెబ్ సిరీస్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ అందాలు ఆరబోయడంలో సరిహద్దులు దాటి మరింత రెచ్చిపోతోందని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం తమిళ్, మలయాళం సినిమాలలో కూడా నటించబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక తన అందంతో కుర్రకారును మెప్పించే ఈ ముద్దుగుమ్మ ట్రెండీ ఔట్ఫిట్ తో మరింత పాపులారిటీని సంపాదించుకుంది . ఫ్యాషన్ ఐకాన్ గా కూడా గుర్తింపు తెచ్చుకుంది ఈషా రెబ్బ.

Read more RELATED
Recommended to you

Exit mobile version