రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ తో భేటీ అయిన ఈటల రాజేందర్

-

భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ భేటీ అయ్యారు.ఈ సందర్భంగా కంటోన్మెంట్ భూములు, ఉద్యోగుల విషయంపై చర్చించారు.సికింద్రాబాద్ కంటోన్మెంట్ ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేస్తున్న నేపథ్యంలో పలు అంశాలను మంత్రి దృష్టికి ఎంపీ ఈటల రాజేందర్ తీసుకెళ్లారు. దేశంలో ఉన్న 62 కంటోన్మెంట్ బోర్డులను విలీనం చేస్తున్న నేపథ్యంలో.. కీలక అంశాలపై స్పష్టత కోరారు.

ముఖ్యంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న..

1. సివిల్ ఏరియాలను విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు.   సివిల్ ఏరియా అంటే.. 16 సివిల్ బజార్ లు మాత్రమేనా.. మిగతా ప్రాంతం కూడానా స్పష్టత ఇవ్వాలి.

 

2. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఉన్న ఉద్యోగుల విలీనం, పెన్షనర్లకు జీతాలు అందించే అంశంపై స్పష్టత కోరారు. ( ఉద్యోగులందరినీ GHMC లోనే విలీనం చేయాలని విజ్ఞప్తి )

 

3. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో పనిచేస్తున్న 125 మంది ఉద్యోగులు చనిపోయారు. 2011 నుంచి కారుణ్య నియామకాలు పెండింగులో ఉన్నాయి. విలీనానికి ముందే 125 మంది కుటుంబసభ్యులకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు .

 

4. B 3 భూములు :  (బ్రిటిష్ ప్రభుత్వం 99 సంవత్సరాలు లీజుకు ఇచ్చిన లాండ్స్) ఈ ల్యాండ్స్ అన్నీ వేరే వారి చేతుల్లోకి వెళ్లాయి. ఈ భూముల భవిష్యత్తు తేల్చాలి అని కోరారు.హోల్డర్ ఆఫ్ అక్యూపెన్సి (HOR ) రైట్స్ విషయంలో ఎలాంటి నిర్ణయాలుంటాయో స్పష్టత ఇవ్వాలని కోరారు.

 

5. A 1 ల్యాండ్స్( మిలటరీ అధికారిక భూములు) లో ఉన్న గుడిసెలు, సాయిబాబా హట్స్, 108 బజార్ హట్స్, నందమూరినగర్, సెంట్రల్ బ్యాటరీ, తిరుమలగిరి, పికెట్ ప్రాంతాల్లో గుడిసెలు వేసుకొని ఉన్న వారి విషయంలో ఎలాంటి నిర్ణయం ఉంటుంది.

 

6. 16 సివిల్ బజార్ ఏరియాలలో నివాసముంటున్న 4500 కుటుంబాల లీగల్ హైర్స్, ఓనర్ షిప్ విషయంపై స్పష్టత ఇవ్వాలని కోరారు.

 

7. 30 సంవత్సరాలుగా కంటోన్మెంట్ ఎంప్లాయ్ హౌసింగ్ సొసైటీ ఇల్లాస్థలాల కోసం పోరాడుతున్న.. హస్మత్ పేటలోని 28. 29 ఎకరాలు, తుర్కపల్లిలోని 13 ఎకరాల భూముల విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలి. కంటోన్మెంట్ ఎంప్లాయ్ హౌసింగ్ సొసైటీవారికే ఈ భూములు కేటాయించాలని కోరారు.

8. B 4 భూములు భవితవ్యం తేల్చాలని కోరారు.

9. ఎవియేషన్ భూములలో నివాసం ఉంటున్న వారి విషయంలో స్పష్టత ఇవ్వాలని కోరారు.

10. సెక్యూరిటీ ఇష్యూస్.

Read more RELATED
Recommended to you

Exit mobile version