దమ్ముంటే నేరుగా యుద్ధం చేయండి : ఈటల రాజేందర్‌

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తన నియోజకవర్గంలో ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. అదే సమయంలో ప్రత్యర్థులకు సవాల్‌ విసిరారు. తాజాగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. హుజురాబాద్లో అల్లకల్లోలం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. వారి గౌరవం నిలబెట్టాలని నన్ను గెలిపించి పంపించారు. గెలిచిన తర్వాత కనీసం ఎమ్మెల్యే అనే గుర్తింపు లేకుండా చేశారు. ప్రశాంతమైన హుజురాబాద్ గడ్డమీద ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు.. దమ్ముంటే సమస్యల మీద మాట్లాడండి… దొడ్డి దారిన యుద్ధం చేసే ప్రయత్నం చేస్తున్నారు.

BJP claims victory in Huzurabad bypoll, Etela starts victory celebrations!

దమ్ముంటే నేరుగా యుద్ధం చేయండి నేను చేసిన సవాలు స్వీకరించండి. గజ్వేల్ లో కొట్లాడుదామా?  హుజురాబాద్లో కొట్లాడుదామా? రండి. హుజురాబాద్లో ఉన్న ప్రజాప్రతినిధులారా వారు చేసే కుట్రలో మనం భాగం పంచుకోవద్దు,  బలి కావద్దు అని వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మేము తలుచుకుంటే పొలిమేరల దాకా తరిమి కొట్టే శక్తి ఉంది. చిల్లర మాటలు నమ్మి అనవసరంగా రెచ్చిపోవద్దని హుజూరాబాద్ ప్రజలకు విజ్ఞప్తి అని ఆయన వెల్లడించారు.