బీజేపీ జెండా ఎగరడం ఖాయం: ఈటల

-

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురుతుందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ నుంచి తనను బయటకు పంపించడం అన్యాయమని, బీజేపీ ఎమ్మెల్యేలను మూడు తోకలంటూ అవమానిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ విమోచన దినం అధికారికంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. తాను గతంలో నయీం ముఠా బెదిరించినప్పుడే భయపడలేదని.. ఇప్పుడు కేసీఆర్ కు ఎలా భయపడతానని ఈటల రాజేందర్ అన్నారు.

శాసనసభలో బీజేపీ సభ్యుల హక్కులను ప్రభుత్వం కాలరాసిందని.. స్పీకర్ ను మర మనిషి అన్నందుకు తనకు శిక్ష వేశారని.. మరి ఇన్నాళ్లూ కేసీఆర్ అన్న మాటలకు ఏం శిక్ష వేయాలని ప్రశ్నించారు. తప్పులు చేసినవాళ్లు దొరల్లా ఉంటున్నారని.. ప్రజల కోసం పనిచేసే వారికి శిక్షలు వేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version