కేసీఆర్‌ను బొంద పెట్టే నినాదం వినిపిస్తోంది : ఈటల

-

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర పేరిట పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా నేడు మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రను యాదాద్రి భువనగిరి నుంచి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కారులో వస్తున్నప్పుడు ఒక ముఖ్య వ్యక్తి ఫోన్ చేసి బీజేపీ వైపు చూస్తున్నట్లు చెప్పారని, నా ఫోన్ ట్యాపింగ్ చేస్తారని చెప్పితే.. వినాలనే చెబుతున్నానన్నారు అని వెల్లడించారు ఈటల రాజేందర్. కేసీఆర్ నీ వెన్ను నీకు కనబడటం లేదు… ప్రజలకు కనబడుతోందన్న ఈటల.. ఎనిమిదేళ్లకాలంలో సమస్యలు వస్తే ప్రగతి భవన్, సచివాలయంలో కలిసే భాగ్యం దక్కిందా ప్రజలు ఆలోచించాలన్నారు. హుజురాబాద్ గడ్డపై యావత్తు తెలంగాణ ప్రజలతో బీజేపీ గెలిచిందని, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో బీజేపీ ఎక్కడ ఉందని ప్రశ్నిస్తున్నారని, ఎక్కడా చూసిన కేసీఆర్ ను బొంద పెట్టే నినాదం వినిపిస్తోందని ఈటల రాజేందర్ అన్నారు.

కాంగ్రెస్ నాయకులు తెలంగాణలో అధికారంలోకి వస్తామని మిడిసి పడుతున్నారని, కాంగ్రెస్‌కు మూలమైన యూపీలోనే కాంగ్రెస్ రెండే సీట్లు గెలిచిందని గుర్తు చేశారు ఈటల రాజేందర్. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అంతరించి పోయిందని, రాష్ట్రంలోని సర్పంచ్‌లు ఎంపీటీసీలు, జడ్పీటీసీ, ఎంపీపీలు బీజేపీలో చేరుతామని ఫోన్ చేస్తున్నారని ఆయన వెల్లడించారు ఈటల రాజేందర్. అధికార పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, ఏడాదిన్నర కాలం ఉంది.. ఉప ఎన్నికలు వస్తాయని భయపడుతున్నారన్నారు. కాంగ్రెస్ నేతలు వస్తామని అంటున్నారని ఆయన స్పష్టం చేశారు ఈటల రాజేందర్.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version