పదేళ్ల తరువాత కూడా కాంగ్రెస్ గుణపాఠం నేర్వలేదు : ప్రధాని మోడీ

-

కాంగ్రెస్ చాలా వేగంగా పతనమవుతోందని నరేంద్ర మోడీ అన్నారు. పదేళ్ల తరువాత కూడా కాంగ్రెస్ గుణపాఠం నేర్వలేదు అన్నారు. ఇప్పటికీ వారి శక్తి సామర్థ్యాలను తెలుసుకోవడం లేదు. కాంగ్రెస్ హయాంలో ప్రధాని నిర్ణయాలను లెక్క చేయలేదు. దేశ ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఎన్డీఏ పని చేస్తోంది. అవినీతి రహిత పాలన అంటే ఏంటో చూపించింది. ప్రజా స్వామ్యాన్ని బలోపేతం చేశామని ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోడీ మాట్లాడారు.

ప్రధానంగా టీడీపీ, జనసేన గురించి పొగిడారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో టీడీపీ పని చేస్తోందన్నారు. ఎన్డీఏ అనేది ఒక విజయవంతమై కూటమి. ఇప్పుడు నాలుగోసారి పరిశీలించబోతోంది. ఎన్డీఏ అంటే ఒక సుపరిపాలన అన్నారు. ఈ కూటమి దేశం కోసం పని చేస్తుందని తెలిపారు. కర్నాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత త్వరగా ఏర్పడిందో.. అంతే త్వరగా విశ్వాసం కోల్పోయిందని తెలిపారు. 22 రాష్ట్రాల్లో ఎన్డీఏ పక్షాలు అధికారంలో ఉండటం ఎన్డీఏ గొప్పతనం అన్నారు. ఎన్డీఏ అద్భుతమైన మెజార్టీని సాధించిందని తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version