పోస్టాఫీస్: భవిష్యత్ కోసం డబ్బులను ఇన్వెస్ట్ చెయ్యాలని చాలా మంది అనుకుంటారు.. రిస్క్ లేకుండా పొదుపు చెయ్యాలని అనుకొనేవారికి ఎన్నో రకాల స్కీమ్ లు అందుబాటులో ఉన్నాయి.. అందులో పోస్టాఫీస్ స్కీమ్ లు కూడా ఉన్నాయి..పోస్టాఫీస్‌లో పలు రకాల స్కీమ్స్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో చేరడం వల్ల రిస్క్ లేకుండా ఆకర్షణీయ రాబడి సొంతం చేసుకోవచ్చు. మీరు ఎంచుకునే స్కీమ్ ప్రాతిపదికన మీకు వచ్చే రాబడి కూడా మారుతుంది. ఎందుకంటే స్కీమ్ ప్రకారం వడ్డీ రేటు మారుతుంది..
పెద్ద మొత్తంలో కాకుండా ప్రతి నెలా కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తే.. మీకు పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ అనువుగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ పథకంలో మీరు ప్రతి నెలా కొంత మొత్తం డిపాజిట్ చేసుకోవచ్చు. మీరు రూ. 100తో కూడా ఈ పథకంలో చేరొచ్చు..ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు. అవసరం అనుకుంటే మరో ఐదేళ్ల వరకు మెచ్యూరిటీ కాలాన్ని పొడిగించుకోవచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 6.2 శాతం వరకు వడ్డీ రేటు లభిస్తోంది.. ఇప్పుడున్న వాటిలో ఇది మంచి వడ్డీ రేటు అనే చెప్పాలి..
ఆర్‌డీ స్కీమ్‌లో చేరడం వల్ల ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ డబ్బులు జమ అవుతూ వస్తాయి. మెచ్యూరిటీ సమయంలో మొత్తం డబ్బులను ఒకేసారి మీ చేతికి వస్తుంది.. అందుకే ఎంతకైనా ఇన్వెస్ట్ చెయ్యొచ్చు పరిమితి లేదు..ఈ స్కీమ్‌లో చేరడం వల్ల లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. స్కీమ్‌లో చేరిన ఏడాది తర్వాత మీరు లోన్ పొందొచ్చు. మీరు డిపాజిట్ చేసిన మొత్తంలో 50 శాతం వరకు లోన్ రూపంలో మళ్లీ పొందొచ్చు..ఉదాహరణకు మీరు ఈ స్కీమ్‌లో చేరి నెలకు రూ. 6 వేలు ఇన్వెస్ట్ చేస్తూ వెలితే.. మీరు పదేళ్ల మెచ్యూరిటీ సమయంలో దాదాపు రూ. 10 లక్షల వరకు లభిస్తాయి.. ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ వస్తుంది.. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చెయ్యండి..