ఎక్కువ ఒత్తిడి తీసుకోవడం వల్ల మానసిక సమస్యలు వస్తాయి. కనుక ఎప్పుడూ కూడా మానసిక ఒత్తిడికి గురవకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. మానసిక ఒత్తిడి వల్ల అనారోగ్య సమస్యలు కూడా దారి తీస్తుంది. అయితే ఎప్పుడైనా ఇతరుల ఒత్తిడి మీ మీద ప్రభావం చూపిస్తుందా లేదా అనేది మీరు ఇలా తెలుసుకోవచ్చు అని నిపుణులు అంటున్నారు. మరి ఆలస్యమెందుకు దీని కోసం పూర్తి చూద్దాం.
ఎప్పుడైనా ఇతరులు వల్ల మీ మీద ఒత్తిడి పడితే మీరు ఈ విధంగా తెలుసుకో వచ్చు. కొన్ని కొన్ని సార్లు మనకి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కానీ దానికి గల కారణం తెలియదు. దీని గురించి మీరు ఆలోచిస్తారు కానీ దీని గురించి మీకు ఏమాత్రం తెలియదు. కనుక ఇది సెకండ్ హ్యాండ్ స్ట్రెస్. అంటే ఇతరుల వల్ల మీరు ఒత్తిడికి గురవుతున్నారని మీరు తెలుసుకోవాలి.
పనిలో వేగంగా ఉండడం:
కొన్ని కొన్ని సార్లు గాబరాగా పనులు చేస్తూ ఉంటారు. ఇది ఒత్తిడి అని మీరు తెలుసుకోవాలి. ఒకవేళ కనుక మీకు నెగటివ్ ఆలోచనలు కానీ ఒత్తిడి కాని ఎవరితోనైనా మాట్లాడినప్పుడు కలిగితే అటువంటి వాళ్ళ నుండి మీరు దూరంగా ఉండటం మంచిది.
ఇతరులు మాటలు:
కొన్ని కొన్ని సార్లు మనకి తెలియకుండా ఇతరులు వల్ల ఒత్తిడి కలుగుతుంది. దీని గుర్తించి వాళ్లతో దూరంగా ఉండటం మంచిది. దీనితో మీకు నెగిటివ్ ప్రభావం పడదు.