కడుపుతో ఉన్న ఆవు మీదకి ఒక ట్రాక్టర్ డ్రైవర్ ట్రాక్టర్ ని ఎక్కించేసాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది. ఆ డ్రైవర్ ఒక ముస్లిం అని కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
కడుపుతో ఉన్న ఆవు మీదకి ట్రాక్టర్ ఎక్కించేసిన అతను ముస్లిం కాదని.. తన పేరు ఈశ్వర్ అని ఇన్వెస్టిగేషన్ లో తేలింది. ఈ ఘటన బిలాస్పూర్, ఛత్తీస్గఢ్ లో జరిగింది. ఇతను ట్రాక్టర్ తో కడుపు తో ఉన్న ఆవు మీదకి ఎక్కించేసాడు.
सड़क पर बैठी गाय किसी का क्या बिगाड़ रही थी, जो इस सुअर के पिल्ले ने कुचल कर उसको मार डाला
इन सूअरों को नीचता के स्तर को समझ पा रहे हो हिंदुओ ??? pic.twitter.com/SSLGEEM0ap— रामेंद्र मिश्र ☀️ (@RAMENDRA2151) June 8, 2021
ఆవు తాలూకా ఓనర్ కంప్లైంట్ ఇస్తే ట్రాక్టర్ డ్రైవర్ ని అరెస్ట్ చేసారు. అయితే ట్రాక్టర్ డ్రైవర్ ముస్లిం కాదని ఈ విచారణ లో తేలింది. తాగేసి వాహనం నడుపుతున్న ఆ డ్రైవర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. అర్ధ రాత్రి పదకొండు గంటలకి తాను తాగి వాహనం నడిపి కడుపు తో వున్నా ఆవు మీదకు ఎక్కించేసాడు.
దీనితో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. సోను యాదవ్ అనే అతని ట్రాక్టర్ ని ఈశ్వర్ తీసుకుని వెళ్తున్నప్పుడు ఇది జరిగింది. అయితే కడుపుతో ఉన్న ఆవుని చంపేసిన అతను ముస్లిం అన్న వార్తలలో ఏమాత్రం నిజం లేదని అది కేవలం ఫేక్ సమాచారం అని తెలుస్తోంది.