చంద్రగిరి కొండ..అందమైన ప్రకృతి..సైన్స్ కు అందని వింతలు..

-

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో అద్భుతమైన ప్రాంతాలు ఉన్నాయి.. కొన్ని ప్రాంతాల్లో కళ్ళు కూడా నమ్మలేని రహస్యాలు ఉంటే, మరికొన్ని ప్రాంతాలలో సైన్స్ కు అందని ఎన్నో వింతలు,విషెషాలను కలిగి ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి చంద్ర గిరి కొండ..ఆ కొండ లో దాగి ఉన్న వింతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

మహావిష్ణువు దశావతారాలతో కూడిన శిల్పకళలలు..సకల దేవతల ప్రతిమలతో నిర్మించిన మండపాలు.. ఒకే బండ నుంచి వచ్చే ఊటలో వేర్వేరు రుచులు.. భటుల విశ్రాంతి కోసం ప్రత్యేక ఆవాసాలు.. ఆశ్చర్యపరుస్తున్న రాతికంచాలు.. అంతుచిక్కని కోనేటి అందాలు.. ఇవీ చంద్రగిరి దుర్గం కోటని అద్భుత దృశ్యాలు.. శ్రీకృష్ణదేవరాయల నాటి శిల్పకళా సౌందర్యాలు, వింతలు, విశేషాలు మరెన్నో నిక్షిప్తమై ఉన్నాయి.

చంద్రగిరి రాయలవారికోట ముందు భాగంలో ఉన్న ఎత్తైన కొండనే చంద్రగిరి దుర్గంగా పిలుస్తుంటారు. శ్రీకష్ణదేవరాయల వారు చంద్రగిరి కోటపై శత్రుమూకలు దాడులకు తెగబడకుండా ఉండేందుకు, ముష్కరుల ఆనవాళ్లను కనిపెట్టేందుకు ఈ కొండను ఎంచుకున్నారు. కోట నుంచి దుర్గం కొండకు చేరుకునేలా నాడు ఐదు కిలోమీటర్ల దూరం దట్టమైన అటవీ ప్రాంతంలో దారిని ఏర్పాటు చేశారు. ఈ కొండపైకి వెళ్లే మార్గంలో నాటి రాజసం, వారి శిల్పాకళాకృతులు నేటికీ సజీవ సాక్ష్యాలుగా దర్శనమిస్తుంటాయి. శ్రీవారిపై అచెంచలమైన భక్తితో రాయలవారు రెండవ రాజధాని అయిన చంద్రగిరిలో అనేక కట్టడాలు నిర్మించినట్టు చరిత్ర చెబుతుంది.రాయల వారు తిరుపతికి వెళ్ళిన ప్రతిసారి ఇక్కడ బస చేసేవారు..

దుర్గం కొండపైకి చేరుకోగానే మనకు కనిపించేది శత్రువుల జాడ కోసం సైనికులు కాపాలాకాసేందుకు ఏర్పాటు చేసిన ఎత్తైన మండపం. అన్ని వేళల్లో ఇక్కడి నుంచే రాజ్యాన్ని పరిరక్షించేవారు. వర్షాకాలంలోనూ విడిది చేసేందుకు మండపం కింద భటులు నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు..అలా పైకి చేరుకోగానే కోనేరు దర్శనమిస్తుంది.అక్కడ కేవలం వర్షపు నీరు తో ఏర్పడింది.రాయలవారి సామ్రాజ్యాన్ని రక్షించుకునేందుకు దుర్గం కొండపై నిత్యం భటులు షిఫ్ట్‌ల పద్ధతిలో విధులు నిర్వహించే వారు. వీరి విడిది కోసం రాయలవారు ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేశారు. కొండపై మట్టి, రాళ్లు లభించకపోయినప్పటికీ ఇంత పెద్ద మండపాలను ఎలా నిర్మించారో అన్న సందేహం కలగకమానదు..

చంద్రగిరి కోటలోకి ప్రవేశించే మార్గంలో కుడివైపున మనకు పెద్ద బండరాయి కనిపిస్తుంది. దానిపై ఉరికొయ్యిని రాయలవారు ఏర్పాటు చేశారు. తీవ్రవాదులు, ముష్కరులు, నేరస్థులను రాజ్యంలోని ప్రజలందరి ముందు ఆ బండపై ఉన్న ఉరికొయ్యిపై ఉరితీసేవారు. అయితే కొంత మంది వాటిని గంటా మండపంగా పిలుస్తుంటారు. తిరుమల శ్రీవారికి నైవేద్యం పెట్టి గంట మోగిస్తారు. అ శబ్దం విన్న తర్వాత బండపై గంట మోగించడం ద్వారా రాయలవారు భోజనం చేసేవారని వినిపిస్తోంది.

దుర్గం కొండకు పడమటి భాగంలో ఉప్పుసట్టి-పప్పుసట్టి ఉంది. ఇక్కడ ఒక బండలో నుంచి ఊటవస్తూ ఉంటుంది. లోపలికి వెళ్లిన తర్వాత నాలుగు ఇంచుల మందంతో ఒక చిన్న గోడ కనిపిస్తుంది. గోడకు ఇటువైపు ఉండేది పప్పు సట్టిగాను, అటువైపు ఉండేది ఉప్పు సట్టిగాను పిలుస్తుంటారు. పప్పుసట్టిలోని నీళ్లు తియ్యగా, ఉప్పు సట్టిలోని నీళ్లు ఉప్పగా ఉంటాయి.ఇవే కాకుండా సైనికులు భోజనం కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేశారు..కోనేటి నుంచి కాసింత దూరం నడుచుకుంటూ వేళ్తే మనకు అక్కగార్ల దేవతలు, నాగాలమ్మ విగ్రహాలు కనిపిస్తాయి. నాగాలమ్మ ఆలయం వద్ద ఉన్న నీటిలో కర్పూరం వెలిగితే, అది రగులుతూ లోపలకి వెళ్లడం అక్కడి అమ్మవారి శక్తికి ప్రతిరూపంగా నిలుస్తోంది..భటులు విశ్రాంతి కోసం ప్రత్యేక గ్రుహాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి.ఇవన్నీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి..

Read more RELATED
Recommended to you

Exit mobile version