RRR : అల్లూరి వేషధారణలో హైదరాబాద్‌కు చరణ్ అభిమానులు..వీడియో వైరల్..

-

‘ఆర్ఆర్ఆర్’ చిత్రం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతోంది. సినిమా సూపర్ హిట్ అని రివ్యూయర్స్, విమర్శకులు పోస్టులు పెడుతున్నారు. ఇక ఈ సినిమా చూసేందుకు సినీ అభిమానులు థియేటర్స్ వద్దకు వస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే చాలా కాలం తర్వాత తమ అభిమాన కథానాయకులను వెండితెర మీద చూడాలని ఆరాటపడుతున్నారు. టాకీసుల వద్ద హీరోల కటౌట్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు పెట్టి పాలాభిషేకాలు చేసి తమ అభిమానం చాటుకుంటున్నారు.

 

ఈ క్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అభిమానులు తమ అభిమానాన్ని వినూత్న రీతిలో చాటుకున్నారు. అల్లూరి సీతారామరాజు వేషధారణలో బాణం పట్టుకుని అర్ధనగ్న వస్త్రాల్లో వేర్వేరు ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు తరలివచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. రామ్ చరణ్ యువశక్తి, చెర్రీ ఫ్యాన్ పేజీలలో ఈ వీడియోలను మెగా అభిమానులు షేర్ చేస్తున్నారు.

బైకు ర్యాలీలతో పాటు ఓపెన్ జిప్సీలలో ఇలా దాదాపు వందకు పైగా మంది అభిమానులు అల్లూరి వేషధారణలో రావడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తమ హీరో అల్లూరి సీతారామరాజు పాత్రను పోషించాడని, వారు కూడా అదే పాత్ర వేషధారణలో తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు వచ్చి తమ గుండెల్లో ఉన్న హీరో పట్ల అభిమానం చాటుకుంటున్నారు. ఇక సినిమాలో రామ్ చరణ్ తేజ్ – జూనియర్ ఎన్టీఆర్ మధ్య దోస్తీ, లడాయి ఫిల్మ్‌లో హైలైట్‌గా నిలిచిందని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నిటినీ ఈ పిక్చర్ తిరగరాస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version