వేగంగా వ్యాప్తి చెందుతున్న Corona Virus BF.7.. లాక్‌డౌన్‌ తప్పదా..?

-

కరోనా మళ్లీ వస్తుందా..? లాక్‌డౌన్ తప్పదా..? వారం రోజుల నుంచి మీరు గమినించారో లేదో.. పరిస్థితులు మారిపోయాయి. ప్రభుత్వాలు, వైద్యులు అప్రమత్తం అయ్యారు. టెస్టులు పెంచారు. మాస్కులు మళ్లీ పెట్టుకుంటున్నారు. కొత్త వేరియంట్‌తో జాగ్రత్తగా ఉండాలని ప్రధాని మోదీయే మీటింగ్‌ పెట్టి మరీ చెప్పారు. పరిస్థితి ఎంత సీరియస్‌గా లేకుంటే..అంత సడన్‌గా మీటింగ్‌ ఏర్పాటు చేస్తారు. చైనాలో అతి వేగంగా వ్యాప్తిచెందుతున్న BF.7 బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. అక్కడ్నించి ఇతర దేశాలకు కూడా త్వరగానే పాకేస్తుంది..

ఇది ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందంటే ఒక మనిషి నుంచి దాదాపు 10 నుంచి 18 మందికి సోకగలదట.. అందుకే చైనా అతి త్వరగా దీని గుప్పిట్లో చిక్కుకుంది. అంతేకాదు ఈ వేరియంట్ మూడు వ్యాక్సిన్లు తీసుకున్న వారిపై కూడా తన ప్రతాపాన్ని చూపిస్తోందని నిపుణులు అంటున్నారు..చైనాలోని షాంఘైలోని అతి పెద్ద ఆసుపత్రి తన సిబ్బందికి పోరాటానికి సిద్ధంగా ఉండాలని సూచించింది. ఎందుకంటే ఆ నగరంలో సగం జనాభా ఈ వేరియంట్ బారిన పడే అవకాశం ఉన్నట్లు అంచనా. అంతేకాదు గణాంకాల ప్రకారం.. చైనాలో 15 లక్షల మంది మరణించవచ్చట. వామ్మో..తలుచుకుంటే మునపటి రోజులు మళ్లీ వస్తాయేమో అని భయంగా ఉంది కదూ..!

చైనా నుంచి బ్రెజిల్, అమెరికా, జపాన్‌లలోనూ కోవిడ్ కేసులు అధికంగా పెరిగాయి. భారత్‌లో కూడా కేసులు బయటపడడం మెల్లగా మొదలైంది. ఒక్కసారిగా… మరో వేవ్ రూపంలో BF.7 విరుచుకుపడే అవకాశం ఉందని వైద్య నిపుణులు భావిస్తున్నారు. ప్రజలు మళ్లీ సామాజిక దూరం, మాస్క్‌లు పాటించాల్సిన అవసరం ఉంది. విదేశీ ప్రయాణాలు మానుకోవాలని, విదేశాల నుంచి వచ్చే వారిని ఐసోలేట్ చేయాలని కూడా వైద్యనిపుణులు అంటున్నారు.

మరో కోవిడ్ వేవ్ వస్తుందా?
BF.7 కేసులు ఇలాగే పెరిగితే మరో కోవిడ్ వేవ్ వచ్చే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు ‘లేదు’ అనే సమాధానం చెబుతున్నారు వైద్యనిపుణులు. అయితే.. శ్వాసకోశ సమస్యల రోగులు ఎక్కువ అవుతారని భావిస్తున్నట్టు తెలిపారు. కానీ మరో వేవ్ రావడం, అది లాక్‌డౌన్‌కు కారణమవ్వడం జరగకపోవచ్చని అంటున్నారు. DR V.K పాల్స్ (నీతి ఆయోగ్ సభ్యులు) చెప్పిన ప్రకారం, మనదేశంలో 27-28% మంది మాత్రమే బూస్టర్ డోస్ తీసుకున్నారు.

ఏది ఏమైనా.. పబ్లిక్‌ ప్లేసులకు వెళ్లేప్పుడు మాస్క్‌, శానిటైజర్‌ మాత్రం తప్పక తీసుకెళ్లండి.. ఈ పరిస్థితుల్లో ఇవే మనకు రక్షణ.. మాస్క్‌ మరవొద్దు.. కరోనా బారిన పడొద్దు.. భయాన్ని మించిన వైరస్‌, ధైర్యాన్ని మించిన టీకా ఉండదు..కాబట్టి.. భయపడకండి.. పరిస్థితి ఇలా ఉందని మాత్రమే మేం చెప్తున్నాం.. ఆందోళనకు గురై అనవసరంగా స్ట్రస్‌ ఫీల్‌ అవ్వాల్సిన పని లేదు. జాగ్రత్తలు పాటిస్తే సరి.!

Read more RELATED
Recommended to you

Exit mobile version