కన్న కొడుకునే దారుణంగా చంపిన తండ్రి…!

-

కన్న కొడుకుని దారుణంగా చంపేశాడు ఈ కసాయి తండ్రి. కళ్ళల్లో కారంపొడి జల్లి తల మీద రోకలి బండతో కొట్టి కొడుకుని చంపేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం పోలీస్ స్టేషన్ పరిధి లో ఇది చోటుచేసుకుంది. చింతకుంట గ్రామానికి చెందిన పెరుమాళ్ల శివ సాయి హైదరాబాదులో ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు.

అయితే వారం రోజుల క్రితం ఇంట్లో శుభకార్యానికి అని వచ్చాడు. శివ సాయిని కన్నతండ్రి శ్రీనివాస్ ఈరోజు ఎవరూ లేని సమయంలో అతి దారుణంగా చంపేశాడు. కళ్ళల్లో కారంపొడి చల్లి రోకలిబండతో తల మీద బలంగా కొట్టడంతో అక్కడికక్కడే శివ సాయి చనిపోయాడు తల్లి ఉపాధి పని కి అని వెళ్ళగా కొడుకు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో తండ్రి ఈ ఘాతకానికి పాల్పడ్డాడు. తర్వాత నిందితుడు కొత్తపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు ఈ ఘటన మీద పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version