ట్రాక్ మరమ్మతు పనుల కారణంగా జంట నగరాల పరిధిలోని వివిధ మార్గాల్లో ఆదివారం పలు ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. లింగంపల్లి-ఫలక్‌నుమా (నంబర్ 47178) ఫలక్‌నుమా-లింగంపల్లి (47157), రాంచంద్రాపురం-ఫలక్‌నుమా (47177) ఫలక్‌నుమా-లింగంపల్లి (47156), ఫలక్‌నుమా-లింగంపల్లి(47155), లింగంపల్లి-ఫలక్‌నుమా (47179), హైదరాబాద్-లింగంపల్లి (47108) సర్వీసులను రద్దు చేసినట్లు చెప్పారు. ఇదిలా ఉంటే..ఇండియన్ రైల్వే ప్రయాణికుల కోసం ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. కొత్త కొత్త రైళ్లను ప్రవేశపెట్టడమే కాకుండా ట్రాక్ మరమ్మతులను ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రోజురోజుకు రైళ్ల సంఖ్యను పెంచుతోంది ఇండియన్ రైల్వే.
అయితే రైల్వే ట్రాక్ మరమ్మతులు, ఇతర కారణాల వల్ల కొన్ని రైళ్లను రద్దు చేస్తుంటుంది. అలాగే మరికొన్ని రైళ్ల సమయాల వేళల్లో మార్పులు, మరికొన్ని రైళ్లను దారి మళ్లించడం వంటివి చేస్తుంటుంది. ఇందులో భాగంగా పలు రైళ్లు 9 రోజుల పాటు రద్దు చేస్తోంది. దీంతో ముందస్తుగా ప్రయాణికులను అప్రమత్తం చేస్తోంది. సెంట్రల్ రైల్వే పరిధిలోని దౌండ్-మన్మాడ్ నాన్ ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.