హాస్టల్ లో అగ్ని ప్రమాదం.. 13 మంది మృతి..!

-

తాజాగా చైనాలో ఒక అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. చైనా లో శుక్రవారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది ఒక పాఠశాల వసతి గృహం లో ఇది చోటు చేసుకుంది. ఈ ఘటన లో 13 మంది విద్యార్థులు చనిపోయారు. ఇక స్థానిక మీడియా కథనాలు ప్రకారం చూసినట్లయితే హెన్నానా ప్రావిన్స్ లోని పాఠశాల వసతి గృహం లో రాత్రి 11 గంటలకి మంటలు వచ్చాయి. అయితే ఈ ప్రమాదంలో 13 మంది చిన్నారులు అక్కడికక్కడే ప్రాణాలని కోల్పోయారు.

మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి సమాచారాన్ని అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని చర్యలను చేపట్టింది ఇక గాయపడిన విద్యార్థుల పరిస్థితి కూడా నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు సమాచారాన్ని ఇచ్చారు. మృతులందరూ మూడవ తరగతి చదువుతున్న విద్యార్థులు అని పాఠశాల ఉపాధ్యాయుడు మీడియాకి చెప్పారు. ఈ ప్రమాదానికి కారణాలు తెలియలేదు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు

Read more RELATED
Recommended to you

Exit mobile version