Breaking : చంచల్‌గూడ జైలులో ముగిసిన నందకుమార్‌ ఈడీ విచారణ

-

ఎమ్మెల్యేలకు ఎర కేసుకు సంబంధించి నందకుమారు ఈడీ ఇవాళ విచారించింది. చంచల్‌గూడ జైలులో 4గంటల పాటు జరిగిన
విచారణలో నందకుమార్ స్టేట్‌మెంట్ రికార్డు చేసిన ఈడీ.. రేపు మరోసారి స్టేట్‌మెంట్‌ రికార్డు చేయనుంది. నందుపై ఉన్న కేసుల వివరాలు సేకరించగా.. ఎమ్మెల్యేలకు ఎర కేసు, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో ఉన్న సంబంధాలు, వ్యాపార లావాదేవీలపై ఆరా తీసింది.బంజారాహిల్స్​లోని ఓ భూ వ్యవహరంలో మధ్యవర్తిగా వ్యవహరించిన నందకుమార్.. భూమిని కాజేయాలని యజమానిని వేధింపులకు గురిచేసినట్లు కేసు నమోదైంది. దీని ఆధారంగా మనీలాండరింగ్ యాక్ట్ కింద నిందితుడిపై ఈడీ కేసు నమోదు చేసింది.

ఇందులో భాగంగా విచారించేందుకు అనుమతివ్వాలని నాంపల్లి కోర్టును ఆశ్రయించింది. అసిస్టెంట్ డైరెక్టర్​తో పాటు మరో ఇద్దరు విచారణ జరిపేందుకు న్యాయస్థానం అంగీకరించింది. కోర్టు అనుమతి మేరకు చంచల్‌గూడ జైలుకు వెళ్లిన ఈడీ అధికారులు.. నందకుమార్‌ను ప్రశ్నించారు. విచారణ కోసం కారాగారంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక గదిలో దర్యాప్తు జరిపారు. రేపు కూడా నందకుమార్‌ను ప్రశ్నించనున్న ఈడీ అధికారులు.. ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version