బ్రేకింగ్ : ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. తేదీలు ఇవే

-

ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇవాళ మీడియా సమావేశం నిర్వహించిన కేంద్ర ఎన్నికల సంఘం..  ఈ సందర్భంగా మాట్లాడుతూ..  కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ ఎన్నికలను నిర్వహిస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఐదు రాష్ట్రాల్లో 18.34 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని పేర్కొన్న ఎలక్షన్ కమిషన్… ఈ ఐదు రాష్ట్రాల్లో మహిళా ఓటర్లు ఈసారి భారీగా పెరిగారని… ఐదు రాష్ట్రాల్లో 24 లక్షల మంది కొత్త ఓటర్లు నమోదయ్యారనీ స్పష్టం చేసింది.

ఈ ఐదు రాష్ట్రాల్లో రెండు లక్షల 15 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన చేసింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈసారి ఆన్లైన్ ద్వారా నామినేషన్ కు అవకాశం కల్పిస్తున్నట్లు ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. కరోనా సోకిన వాళ్లకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు అవకాశం కల్పిస్తామని చెప్పింది. మొత్తం ఐదు రాష్ట్రాల్లో 690 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది ఎలక్షన్ కమిషన్.

ఉత్తర ప్రదేశ్ 403, మణిపూర్ 70 , గోవా 60, పంజాబ్ 117, ఉత్తరంఖడ్ 40 అసెంబ్లీ స్థానాలకు  ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేసింది ఎన్నికల కమిషన్ పేర్కొంది. తక్షణమే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని ప్రకటించింది. మొదటి విడతలో ఉత్తర ప్రదేశ్ లో ఎన్నికలు నిర్వహిస్తున్నామని పేర్కొంది. జనవరి 14న నామినేషన్ ప్రక్రియ మొదలు కానుందని.. ఫిబ్రవరి 10 మొదటి విడత ఎన్నికలు జరుగుతాయని పేర్కొంది.

5 states election dates

Phase 1: Feb 10
Phase 2: Feb 14 (Punjab, UK, Goa)
Phase 3: Feb 20
Phase 4: Feb 23
Phase 5: Feb 27 (Manipur)
Phase 6: March 3 (Manipur)
Phase 7: March 7

Results : march 10

Read more RELATED
Recommended to you

Latest news